విజయనగరం

ప్రభుత్వానికి అడ్డంకులు కల్పిస్తున్న జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 12: తన తండ్రి హయాంలో అక్రమంగా సంపాదించిన డబ్బును కాపాడుకునేందుకు, అవినీతి, అక్రమాలపై నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి మంచిపనికి అటంకాలు కల్పిస్తున్నారని జిల్లా ఇన్‌చార్జి, సమాచార, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశ తప్ప వైఎస్ జగన్‌కు రాష్ట్ర సమస్యలు, ప్రజల సమస్యలు పట్టవని విమర్శించారు. జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లు ఎంపిగా ఉన్నపుడు వైఎస్ జగన్ ఏ ఒక్కరోజు కూడా రాష్టస్రమస్యలపై పార్లమెంటులో నోరు విప్పలేదని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం చేపడుతున్న పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణాలకు, రాజధాని అమరావతి నిర్మాణానికి, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణకు అడ్డంకులు కల్పిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షనాయకుడు అనుసరిస్తున్న విధానాలను రాష్ట్రప్రజలు గమనిస్తున్నారని, ఆయనకు తగిన సమయంలో ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. నాగావళి, చంపావతి, సువర్ణముఖి, వేగావతి నదుల అనుసంధానం ద్వారా సాగునీరు, వ్యవసాయ రంగాలలో విజయనగరం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు.