విజయనగరం

క్రీడలతో ఉజ్వల భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతానగరం, ఆగస్టు 26: రాష్టస్థ్రాయి 31వ టెన్నికాయిట్ బాలబాలికల క్రీడా పోటీలు సీతానగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఈ పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరిలో ఏదొఒక ప్రతిభ ఉంటుందన్నారు. దానిని వెలికితీస్తే మంచి ప్రతిభావంతులుగా తయారు చేయవచ్చునన్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు. క్రీడల్లో గొప్పగా రాణించిన వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతిఒక్కరూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం తగిన చేయూతనిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు భవిష్యత్తును చక్కగా మలుచుకోవాలన్నారు. ఈ మేరకు జ్యోతిప్రజ్వలన అనంతరం రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం సరదాగా క్రీడాకారులతో ఎమ్మెల్యే క్రీడల్లో పాల్గొన్నారు. కాగా ఈ నెల 28 వరకు ఈ రాష్టస్థ్రాయి పోటీలు కొనసాగనున్నాయి. అనంతరం జాతీయస్థాయి పోటీలు చెన్నైలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఇఒ గౌరీశంకర్, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి కొమ్మినేని కిశోర్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షులు కొల్లి తిరుపతిరావు, ఆర్.వేణు, అన్నంనాయుడు, తెంటు వెంకటప్పలనాయుడు తదితరులతో పాటు రాష్ట్ర టెన్నికాయిట్ కార్యదర్శి సత్యనారాయణ, మండల పోటీల నిర్వాహకులు డివిజి గాంధీ, ఎంపిడిఒ పైడితల్లి, ఎఒ ఉమామహేశ్వరనాయుడు, ఎస్‌ఐ లక్ష్మణరావు, హెచ్‌ఎం రాధాకృష్ణతోపాటు 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.