విజయనగరం

కార్మిక సంక్షేమాన్ని గాలికి వదిలివేసిన ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 25: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చేనెల 2వ తేదీన సమ్మె చేస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లారుూస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ తెలిపారు. ఈ మేరకు ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకు శుక్రవారం సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమంపై కనీసం పట్టించుకోవడం లేదని తెలిపారు. కార్మికులందరికీ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్‌లను హక్కుగా ఇచ్చేందుకు బిజెపి, టిడిపి ప్రభుత్వాలు సిద్ధంగా లేవని చెప్పారు. సామాజిక భద్రతను కల్పించే పిఎఫ్, పెన్షన్, ఇఎస్‌ఐ సౌకర్యాలను హక్కుగా అసంఘిత రంగ కార్మికులు సాధించుకోవల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రభుత్వ నిధులతో పిఎఫ్, పెన్షన్, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పథకాలకు చెందిన చట్టాలలో ఉన్న రూల్స్ ప్రకారం కార్మికుల నుంచి, యజమానుల నుంచి పిఎఫ్ నిధిని వసూలు చేయాలన్నారు. స్వయం ఉపాధి కార్మికులకు, చిన్నవ్యాపారులకు యజమానులను వాటాను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందుకు బడ్జెట్‌లో పెద్దఎత్తున నిధులను కేటాయించాలని చెప్పారు. చంద్రన్నబీమా పథకం వల్ల కార్మికులకు పెద్దగా ప్రయోజనం లేదని, తెలుగుదేశం ప్రభుత్వ ప్రచారానికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుందని అన్నారు. కార్మికుల హక్కులను సాధించేందుకు అన్ని కార్మిక సంఘాలు వచ్చేనెల 2వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేయాలని నిర్ణయించాయని తెలిపారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు.