విజయనగరం

మద్యం షాపులను మూసివేయాలని... కొనసాగుతున్న మహిళల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 1: పట్టణంలో శాంతినగర్‌లో బీసెంట్ స్కూల్‌కు వెళ్లే రోడ్డులో మద్యం దుకాణాలను మూసివేయాలని మహిళలు చేపడుతున్న నిరసన కొనసాగుతోంది. మహిళల నిరసన గురువారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది. ఇక నుంచి షాపుల ముందు నిరవధిక ధర్నా చేయాలని నిర్ణయించారు. రెండుషాపుల ముందు గురువారం నిరవధిక ధర్నాను చేపట్టారు. అదే విధంగా వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. షాపులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యను పరిష్కరించడంలో ప్రధానంగా ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్న షాపుల యజమానులు ఎలాగైనా షాపులను తెరిపించాలనే ఆలోచనలో ఉన్నారు. గత రెండు రోజులుగా పోలీసు, ఎక్సైజ్ అధికారులను నిలదీయడంతో గురువారం ఆ ప్రాంతానికి అధికారులెవరూ రాలేదు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మద్యం షాపులను మూసివేయాలని మహిళలు చేపడుతున్న ఆందోళనపై ఇప్పటికే ఎమ్మెల్యే మీసాల గీత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సైలాడ త్రినాథరావు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి 39వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు కెల్ల సూరిబాబు తీసుకెళ్లారు. దీనిపై ఏదొక నిర్ణయం తీసుకోకపోతే పార్టీపరంగా ఇబ్బందులు పడవల్సి వస్తుందని ఆయన చెప్పినట్లు తెలిసింది. గుడి,బడి ఉన్న చోట మద్యం దుకాణాలను ఎలా నిర్వహిస్తారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ అధికారులను నిలదీశారు. జనావాసాల మధ్య ఇక్కడ ప్రధాన రహదారిలో వైన్‌షాపు, బార్‌షాపు ఉండటం వల్ల క్షణక్షణం భయం భయంగా కాలం గడుపుతున్నారని 39వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కెల్ల వరలక్ష్మి తెలిపారు. ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంషాపుల వల్ల ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, కొద్దిరోజుల క్రితం ఇక్కడ జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందిందని ఆమె తెలిపారు. చుట్టుపక్కల విద్యాసంస్థలు ఉండటం వల్ల ఈ రహదారి మీదుగా బాలబాలికలు రాకపోకలు సాగిస్తున్నారని, తాగుబోతుల సంచారం వల్ల వీరికి తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని చెప్పారు. జనావాసాలు, గుడి, బడి ఉన్నచోట్ల మద్యం షాపులకు నిర్వహణకు ఎలా అనుమతులు ఇచ్చారో అర్థం కావడం లేదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. ఎట్టిపరిస్థతులలోనూ ఇక్కడ మద్యం దుకాణాలను ఎత్తివేయవల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ శిబిరాన్ని ఎఐటియుసి నాయకులు బుగత సూరిబాబు, ఆల్తి చినమారయ్య, జగన్నాధం, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు సందర్శించి సంఘీభావం తెలిపారు.