విజయనగరం

రామతీర్థంలో భారీ అన్నదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, ఏప్రిల్ 5: రామతీర్థంలో దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఆనందగజపతిరాజు జ్ఞాపకార్థం మంగళవారం 500మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతారామునిపేట, రామతీర్థం దేవుని నెలివాడ, గొర్లిపేట గ్రామస్థులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ పి బాబూరావు మాట్లాడుతూ ఆనందగజపతిరాజు రామతీర్థం ఆలయ అభివృద్ధికి ఎనలేని కృషి చేసారని అన్నారు. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ హోదాలో అనేక కళాశాలలు స్థాపించి పేదలకు విద్యాదానం చేసారని కొనియాడారు. ఆనందగజపతి సొంత భూములను రామతీర్థం, శ్రీకూర్మం, అరసవిల్లి, సింహాచలం దేవాలయాల దేవుని మాన్యం కింద దానం చేసారని చెప్పారు. ఆ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో దేవాలయాలలో దూపదీప నైవేద్యాలు పెడుతున్నారని చెప్పారు.