విజయనగరం

వర్ధంతిలోనూ వర్గాలే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి రోజున కూడా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్‌లో వర్గ విబేధాలు బహిరంగమయ్యాయి. జిల్లా కేంద్రంలో పార్టీలోని రెండు వర్గాలు ఎవరికివారు వర్ధంతి కార్యక్రమం నిర్వహించటంతో ఏ వర్గం కార్యక్రమంలో పాల్గొంటే ఎవరికి కోపం వస్తుందోనని కొందరు నాయకులు, ముఖ్య కార్యకర్తలు అనుమానించవల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీలోని జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వర్గం, బొత్స వర్గం ఎవరికివారే కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు నాయకులకు, పార్టీశ్రేణులకు సమాచారం పంపించారు. వెంకటలక్ష్మి జంక్షన్‌వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి శుక్రవారం ఉదయం పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు నిర్ణయించారు. కానీ రెండువర్గాలు ఒకేచోట వర్ధంతి కార్యక్రమం నిర్ణయించడంతో పార్టీశ్రేణుల్లో అయోమయం ఏర్పడింది. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మాజీమంత్రి బొత్స వర్గానికి చెందిన ఎడ్ల రమణమూర్తి, పిళ్లా విజయకుమార్, అవనాపు విజయ్ తదితర నాయకులు తమ మద్దతుదారులతో వెంకటలక్ష్మి జంక్షన్‌కు చేరుకుని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటికే పక్కన ఉన్న నాయుడు ఫంక్షన్ హాలులో వేచి ఉన్న కోలగట్ల వర్గం మద్దతుదారులు బొత్స మద్దతుదారులు ఎప్పుడు వెళ్లిపోతారా?అని ఎదురుచూపులు చూడవల్సి వచ్చింది. వైఎస్‌కు నివాళి అర్పించి, మీడియాతో మాట్లాడిన అనంతరం బొత్స వర్గం నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోగానే కోలగట్లకు సమాచారం ఇవ్వటంతో ఆయన వెంకటలక్ష్మి జంక్షన్‌కు చేరుకున్నారు. నాయుడు ఫంక్షన్ హాలు నుంచి ఊరేగింపుగా వైఎస్ విగ్రహం వద్దకు వెళ్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీలోని రెండు గ్రూపుల మధ్య సమన్వయం లేక కిందిస్థాయి నాయకులు, శ్రేణులు పలు సందర్భాల్లో ఇబ్బందులకు గురయ్యారు. ఒకటి, రెండు సందర్భాల్లో మినహా అన్ని కార్యక్రమాలను పార్టీలోని రెండు గ్రూపులు వేర్వేరుగా నిర్వహించటంతో కార్యకర్తలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వేర్వేరుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కారణంగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని కిందిస్థాయి నాయకులు వాపోతున్నా తమ వర్గం నాయకులకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. రెండు వర్గాల ముఖ్యులతో సంబంధాలు ఉన్న నాయకులు సాధ్యమైనంత వరకు రెండువర్గాల కార్యక్రమాలకు హాజరవుతున్నారు. శుక్రవారం మొదట జరిగిన బొత్స వర్గం నివాళిలో పాల్గొన్న కొందరు నాయకులు, కార్యకర్తలు పక్కనే ఉన్న నాయుడు ఫంక్షన్ హాలులో కోలగట్ల మద్దతుదారులు ఏర్పాటుచేసిన అల్పహారం తీసుకుని తరువాత ఆ వర్గం కార్యక్రమంలో పాల్గొనటం విశేషం.