విజయనగరం

జిల్లాలో కార్మిక సంఘాల సమ్మె ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 2: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వివిధ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం జిల్లావ్యాప్తంగా సమ్మె ప్రశాంతంగా, పాక్షికంగా జరిగింది. సమ్మె సందర్భంగా జిల్లాకేంద్రంతోపాటు జిల్లాలోని పలుచోట్ల బ్యాంకులు, పోస్ట్ఫాసులు పనిచేయకపోవటంతో ప్రజలకు సేవలు అందకుండా పోయాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన కిందిస్థాయి సిబ్బంది సమ్మెలో పాల్గొనగా, అధికారులు మాత్రం విధులు నిర్వహించారు. బిఎస్‌ఎన్‌ఎల్ సేవలకు ఎటువంటి అవాంతరాలు కలగలేదు. సమ్మెను పురస్కరించుకుని పట్టణంలో ఎఐటియుసి, సిఐటియు, ఐఎన్‌టియుసి, ఎఐఐఎఫ్‌టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాలు పట్టణంలో భారీ ర్యాలీలు నిర్వహించాయి. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా, బహిరంగ సభ జరిపాయి. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తమ విధానాన్ని మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించాయి. బ్యాంకుల విలీనం, బ్యాంకులలోని వివిధ విభాగాలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయా బ్యాంకులకు చెందిన ఉద్యోగ సంఘాలు ధర్నా నిర్వహంచాయి. కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తమతమ కార్యాలయాల వద్ద ప్రదర్శనలు జరిపాయి. పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా సమ్మెకు తమ సంఘీభావం ప్రకటించాయి.