విజయనగరం

జోరుగా ఇసుక అక్రమ రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఏప్రిల్ 5: ఇసుక అక్రమ రవాణా మరింత పెరిగింది. ఇటీవల అక్రమ రవాణా అరికట్టడానికి తహశీల్దార్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఇసుక భారీగా తరలుతోంది. నిషేధిత ప్రాంతాల నుండి రాత్రి పగలు తేడా లేకుండా ట్రాక్టర్లు, లారీలలో ఇసుకను రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. గజపతినగరం గ్రామం మధ్యలో గల రహదారి మీదుగా రవాణా జరుగుతున్నందున పది రోజుల వ్యవధిలో సిమెంట్ రోడ్డు మట్టిరోడ్డుగా మారిపోయి శిథిలమైపోయింది. ఇసుక తరలిపోతున్నా కనీసం తనిఖీలు జరగడంలేదు. నాలుగు రోడ్లు జంక్షన్‌లో నిత్యం ఇద్దరో ముగ్గురు గానీ కానిస్టేబుళ్లు ఉంటారు. మండలంలో ములకల గుమడాం, లోగిశ వద్ద అధికార రీచ్‌లు ఉన్నాయి. చంపావతి నదిలో మరో 10 వరకు అనధికార రీచ్‌ల నుండి ఇసుక నిత్యం తరలిస్తున్నారు. గ్రామస్థాయిలో గల అధికారులు, ఉద్యోగులు పట్టించుకోవడంలేదు.