విజయనగరం

పనితీరులో అంగన్‌వాడీ సిబ్బంది ఆదర్శంగా నిలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, సెప్టెంబర్ 4: అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది మరింత బాధ్యతగా సేవలు అందించి, పనితీరులో ఆదర్శంగా నిలవాలని గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు అన్నారు. జాతీయ పౌష్టికాహార వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం గంట్యాడలో మండల స్థాయిలో పలు కార్యక్రమాలను వరల్డ్ విజన్ సహకారంతో ఐసిడిఎస్ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరులో మనరాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహనతోపాటు సహనం అవసరమన్నారు. ఆరోగ్య విషయాలపై అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి వైద్య నిపుణులతో అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ ఏడాది చివరికల్లా గజపతినగరం నియోజకవర్గంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు మహారాష్టన్రు తలపించే విధంగా సౌకర్యాలు, సేవల విషయంలో తయారు కావాలని చెప్పారు. వరల్డ్ విజన్ జిల్లా మేనేజర్ శ్యాంబాబు మాట్లాడుతూ గర్భం దాల్చిన నాటి నుంచి శిశువుకు రెండేళ్ల వయస్సు వచ్చేవరకు ఉన్న వెయ్యి రోజులు ఎంతో కీలకమన్న విషయాన్ని మహిళలు గుర్తించాలన్నారు. సరైన పౌష్టికాహారం ఇవ్వడంతోపాటు సరైన సమయంలో టీకాలను వేయించాలన్నారు. మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణలో అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందిదే కీలకపాత్ర అని చెప్పారు. ఎంపిపి దేవుడమ్మ మాట్లాడుతూ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలలో పారదర్శకత పెరగాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ బాపిరాజు, ఎంఇఓ శంకరరావు ప్రసంగించారు. గంట్యాడ ఐసిడిఎస్ సిడిపిఓ ప్రసన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించారు. పౌష్టికాహార వంటల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.