విజయనగరం

విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 4: విజయనగరం జిల్లా కేంద్రం నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాల కారణంగా ఆర్టీసీ భారీ ఆదాయం కోల్పోతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మెయిన్ రోడ్ల వరకు తిరగవల్సిన ఆటోలు, కొన్ని రూట్లకు పరిమితం కావల్సిన మ్యాక్సీ క్యాబ్‌లు నిబంధనలకు విరుద్ధంగా అన్ని మార్గాలలో స్టేజి క్యారేజీలుగా తిప్పుతుంటే రవాణాశాఖ అధికారులు, పోలీసులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అడపాదడపా తనిఖీలు నిర్వహిస్తూ జరిమానాలతో సరిపెడుతున్నారు. ప్రైవేటు వాహనాల నుంచి నెలవారీ మామూళ్లు రూపేణ భారీగా డబ్బు అందుతున్న కారణంగా అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. విజయనగరం నుంచి విశాఖ నగరానికి ప్రతి ఐదు నిముషాలకు ఒక బస్సు చొప్పున ఆర్టీసీ నడుపుతోంది. అదేవిధంగా చీపురుపల్లి, గజపతినగరం, శృంగవరపుకోట, బొబ్బిలి తదితర ప్రాంతాలకు ప్రతి 15నిమిషాల నుంచి అరగంటకు ఒక బస్సు తిరుగుతోంది. జామి, పూసపాటిరేగ, గంట్యాడ ప్రాంతాలకు కూడా అరగంటకు ఒక బస్సు చొప్పున తిరుగుతున్నాయి. కానీ ఆర్టీసీ బస్సులకు పోటీగా అన్ని మార్గాలలో మ్యాక్సీ క్యాబ్‌లు, మూడు, నాలుగు చక్రాల ఆటోలు విచ్చలవిడిగా తిరుగుతుండటంతో ఆర్టీసి బస్సులు చాలా సమయాల్లో ఖాళీగా వెళ్లవల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆటోలు, మాక్సీకాబ్‌లు అడిగిన చోటల్లా ఆపుతున్న కారణంగా ప్రయాణికులు ప్రైవేటు వాహనాలపైనే మక్కువ చూపుతున్నారే తప్ప ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోతాయనే విషయాన్ని పట్టించుకోవటం లేదు. ఆర్టీసీ బస్‌స్టేషన్లకు ఎదురుగానే మ్యాక్సీక్యాబ్‌లను, ఆటోలను పెట్టుకుని బస్‌స్టేషన్లకు వచ్చే ప్రయాణికులను తమ వాహనాల్లోకి ఎక్కించుకునే ప్రయత్నాలను ఎవరూ అడ్డగించే, అడిగే పరిస్థితి కనపడటం లేదు. ఫలితంగా ప్రయాణికులు లేక ఆర్టీసి కొన్ని రూట్లలో బస్సుల సంఖ్యను ఇప్పటికే తగ్గించగా, మరికొన్ని రూట్లలో వాటిని నామమాత్రం చేసే పరిస్థితి తలెత్తుతోంది. జాతీయ రహదారులపై ఆటోలు తిరగకూడదనే నిబంధనను అటోడ్రైవర్లు, అధికారులు ఎప్పుడో మరచిపోయారు. దీనికితోడు లెక్కకు మించి ప్రయాణికులను ఆటోల్లో, మ్యాక్సీకాబ్‌ల్లో ఎక్కించుకుంటున్నా పోలీసులు, రవాణా శాఖ అధికారులు కనీసం స్పందించటం లేదు. ముగ్గురు కూర్చొనే ఆటోలో ఎనిమిది మందిని, సెవన్ సీటర్ ఆటోలో 15నుంచి 18మందిని ఎక్కించుకుని ప్రమాదకర పరిస్థితులలో ఆటోలను నడుపుతున్నారు. త్రీ-సీటర్, సెవెన్ సీటర్ ఆటోల్లో ముందు సీట్లో డ్రైవర్ ఒక్కరే కూర్చోవల్సి ఉండగా, ఇద్దరు, ముగ్గురు ప్రయాణికులను కూర్చోబెడుతున్నారు. లెక్కకుమించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న కారణంగా కనీసం స్టీరింగ్ తిప్పే అవకాశం లేక ప్రమాదాలకు దారితీస్తోంది. జాతీయ రహదారులపై ఈ కారణంగా జరిగిన ప్రమాదాల్లో చాలామంది మరణిస్తున్న సంఘటనలు గడచిన కొంతకాలంగా కొనసాగుతునే ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, ఆర్టీఎ అధికారులు ఒకటి, రెండురోజులు హడావుడి చేయడం, తరువాత పట్టించుకోక పోవటంతో ఆటో, మాక్సీక్యాబ్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హక్కుల గురించి మాట్లాడే కార్మిక సంఘాలు ప్రజల ప్రాణాలను హరించే విధంగా వ్యవహరిస్తున్న ఆటోలు, మాక్సీక్యాబ్‌ల నిర్వాహకులకు బాధ్యతలను తెలిపే విషయాన్ని పట్టించుకోవటం లేదు. ఇకపోతే ఇటీవల విజయనగరం నుంచి కొన్ని రూట్లలో నడిచే ప్రైవేటు బస్సులు ఏకంగా ఆర్టీసీ బస్‌స్టేషన్ ముందు నిలిపి ప్రయాణికులను ఎక్కిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. నిబంధనల ప్రకారం బస్‌స్టేషన్‌కు 200మీటర్ల దూరంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్‌కు అనుమతించవల్సి ఉండగా, బస్‌స్టేషన్ ఎదుటే ప్రైవేటు వాహనాలను నిలిపితే అడిగేవారు లేకుండా పోయారు. జిల్లాలోని పార్వతీపురం, శృంగవరపుకోట, సాలూరు బస్‌డిపోల పరిధిలో కూడా ఇదేవిధంగా ప్రైవేటు వాహనాలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్న కారణంగా ఆర్టీసీ నష్టాలు రోజురోజుకు పెరిగిపోవటం, ప్రయాణికులకు బస్సు సౌకర్యాలు తగ్గిపోవటం కొనసాగుతోంది.