విజయనగరం

సర్వేపల్లి ఆదర్శంగా ఉపాధ్యాయ వృత్తికి వనె్నతేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 6 : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అంకిత భావంతో వృత్తిలో రాణించి వనె్న తేవాలని జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆనందగజపతి ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన గురుపూజోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుండి దేశ అత్యున్నత పదవిని, పురస్కారాన్ని అందుకున్న మాజీ రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణ జీవితాన్ని ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకుని విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించడానికే పరిమితం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్, వనం-మనం వంటి సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతు సమాజంలో ఇతర వృత్తులకు దక్కని గౌరవం ఉపాధ్యాయ వృత్తికే లభించడం గర్వకారణమన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైందని, మంచి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి, సామర్థ్యాలు ఉపాధ్యాయులకు ఉన్నాయని అన్నారు. పాఠాల బోధనలో సృజనాత్మకతను జోడించి అదనపు అంశాలలో విద్యార్థులను తయారుచేయగలిగితే అన్ని రంగాలలో రాణిస్తారని చెప్పారు. పిల్లలు మీకు స్ఫూర్తి ఎవరంటే టీచర్ మా స్ఫూర్తి అని గౌరవంగా చెప్పేలా ఉపాధ్యాయులు నోబెల్ సర్వీస్‌గా తీసుకుని రోల్‌మోడల్ కావాలన్నారు. ఉపాధ్యాయుడు తనకు అంతా వచ్చని భావించకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, బోధనాంశాలలో వచ్చే నూతన ఒరవడులను అందిపుచ్చుకుని వాటిని విద్యార్థులకు నేర్పాలని హితవుపలికారు. ఓడిఎఫ్ గ్రామాల నిర్మాణం, పర్యావరణంలో సహకరించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు సక్రమంగా పనిచేయకపోతే తరం నష్టపోతుందని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. ఐదువేల పాఠశాలలో డిజిటల్ తరగతులు, కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్యను అందించేందుకు పంచాయతీకి ఒక మోడల్ స్కూల్, ఎంఇఓ పోస్టులు భర్తీ, ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలను పరిష్కరించడంతోపాటు వౌళిక సదుపాయాలపై దృష్టి సారించిందన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ఉపాధ్యాయులు నడుం బిగించాలని చెప్పారు. ఏజెసి నాగేశ్వరరావు, డిఇఓ అరుణకుమారి, డైట్ ప్రిన్సిపాల్ కె.వి.రమణ, డిప్యూటీ డిఇఓ గౌరీశంకర్ మాట్లాడుతూ శతశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా వృత్తికి న్యాయం చేయాలన్నారు. సమాజగతిని మార్చే శక్తి ఉపాధ్యాయులకు ఉందని, వృత్తి ధర్మం నిర్వర్తించి ఉత్తమ ఉపాధ్యాయులుగా సమాజంలో గుర్తింపు పొందాలని కోరారు. ఈ సందర్భంగా 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించారు.