విజయనగరం

విద్యల నగరంలో గణేషునికి విశేష పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 6: తరాలు మారినా వినాయక చవితి పండుగను సంప్రదాయబద్ధంగా ప్రజలు ఆచరిస్తున్నారు. ఆకృతులు ఏవైనా కుల, మతాలకు అతీతంగా గణనాథుడు పూజలు అందుకుంటూ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. వినాయక చవితిని పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధలతో జరిపారు. ఈ పండుగను కుటుంబ సభ్యులు ఇళ్లల్లో, నవరాత్రి మండపాలలో ఘనంగా జరిపారు. విద్యలనగరం విజయనగరంలో గణపయ్యను వివిధ ఆకృతుల్లో ఆకర్షణీయమైన మంటపాలలో గణపతి నవరాత్రి కమిటీలు కొలువుదీర్చాయి. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు రైల్వే ఓల్డ్ కాలనీ గాడీఖానా సీనియర్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక ప్రతిమ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. స్ర్తిమూర్తి ఆకారంలో విద్యావాంఛ సంకల్ప గణపతిని యువత ప్రతిష్టించారు. పరిసర ప్రాంతాల మహిళా భక్తులు, విద్యార్థులు ఈ గణపతిని విశేషంగా దర్శించుకుంటున్నారు. వెంకటలక్ష్మి కూడలిలో వినాయక చవితి కమిటీ ఆధ్వర్యంలో అరకచేతబట్టిన రైతు బిడ్డ ఆకారంలో సాయిబాబా ఆకృతిలో వినాయక ప్రతిమను నెలకొల్పారు. ఎన్‌సిఎస్ జంక్షన్‌లో వరసిద్ధి వినాయక చవితి కమిటీ 30వ వార్షికోత్సవం సందర్భంగా నూతన రాజధాని అమరావతి హైటెక్ సిటీ సెట్‌లో వినాయకుడుని కొలువుదీర్చారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో వినాయక మంటపాలు భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాయి.