విజయనగరం

మరుగుదొడ్డి లేకుంటే ప్రభుత్వ రాయితీలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, సెప్టెంబర్ 8: పురపాలకసంఘం పరిధిలో నవంబరు నాటికి పూర్తి స్థాయిలో ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలని, లేనిపక్షంలో ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు రద్దవుతాయని పురపాలక సంఘం చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి స్పష్టం చేశారు. పురపాలకసంఘం కార్యాలయంలో గురువారం విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అక్టోబరు 2వతేదీ నాటికి శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. మరుగుదొడ్లు లేనివారు ఈనెల 15వతేదీలోగా దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు. దీని నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రుణ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికే పట్టణంలో లక్ష్యానికి చేరువలో మరుగుదొడ్ల నిర్మాణంలో ఉన్నట్టు తెలిపారు. 81 శాతం పూర్తయిందని, శతశాతం పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అక్టోబరు 2వతేదీ తరువాత ప్రభుత్వం మరుగుదొడ్ల మంజూరు చేసే అవకాశం లేదన్నారు. ఈలోగా లబ్దిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో రేషన్‌కార్డులు, కుళాయి కనెక్షన్లు, విద్యుత్ సౌకర్యాలు రద్దుచేయడంతోపాటు అపరాధ రుసుంకూడా విధిస్తామని ప్రభుత్వం తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని మరుగుదొడ్డి లేని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓంకార్ థియేటర్, గొల్లపల్లి, షాదీఖానా ప్రాంతాల్లో మరో మూడు సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదించామని తెలిపారు. ఈమెతోపాటు వైస్ చైర్మన్ రమేష్‌నాయుడు, కమిషనర్ శంకరరావు పాల్గొన్నారు.