విజయనగరం

శతశాతం మరుగుదొడ్లు 2 నాటికి పూర్తి చేస్తే స్మార్ట్ గ్రామంగా ప్రకటిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెర్లాం, సెప్టెంబర్ 8: శతశాతం మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తయితే స్మార్ట్ విలేజ్‌గా ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. మండలంలో ఒడిఎఫ్ గ్రామంగా ఎంపికైన లింగాపురం పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణంపై గురువారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ విలేజ్‌గా ఎంపికైతే 35 లక్షల రూపాయలు విలువచేసే అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తామన్నారు. ఇటీవల స్పీకర్ కోడెల శివప్రసాద్ విజయనగరం వచ్చేటప్పుడు ఈ విషయం ప్రకటించినట్లు గుర్తు చేశారు. శతశాతం మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తిచేసిన 35 మంది సర్పంచ్‌లకు సన్మానాలు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ నెల 2వ తేదీనాటికి పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు నిర్మాణ పనులు పూర్తిచేస్తే జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తామన్నారు. డుమా పిడి ప్రశాంతి మాట్లాడుతూ కట్టిన మరుగుదొడ్లు వినియోగించుకోవాలన్నారు. కొన్ని గ్రామాల్లో కట్టిన మరుగుదొడ్లలో సరుకులు నిల్వచేసే గదులుగా వినియోగిస్తున్నారన్నారు. మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జెడ్పీటిసి నర్సుపల్లి వెంకటరామలక్ష్మి మాట్లాడుతూ తోటపల్లి కాలువ ఉన్నప్పటికీ తమకు ప్రయోజనం లేకుండా పోతోందని, పలుచోట్ల పిల్లకాలువలు ఏర్పాటుచేస్తే సుమారు 9 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. గ్రామ సర్పంచ్ బూరాడ తవిటినాయుడు మాట్లాడుతూ శతశాతం మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఈ నెల 25వతేదీలోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంపై ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుచేసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. తెర్లాం పిహెచ్‌సి నుంచి అంట్లవార వరకు ఎనిమిదేళ్లకిందట వేసిన రోడ్డు శిధిలావస్థకు చేరుకుందన్నారు. నందిగాం-అంట్లవార, అంట్లవార-వంతరాం, లింగాపురం-కొరటాం గ్రామాలకు రోడ్లు వేయాలని కలెక్టర్ దృష్టికితేగా ఆయన స్పందిస్తూ ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకం కింద రోడ్లు వేసుకోవాలన్నారు. ముందుగా నాడెఫ్, మరుగుదొడ్లు, చంద్రన్నబాటపై వేసిన అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ బి.ఉషారాణి, తహశీల్దార్ ఆర్.ఎర్రంనాయుడు, ఉపాధి ఎపిఒ కె.కేశవరావు, వెలుగు ఎపిఎం చిన్నారావు, ఐసిడిఎస్ పిఒ కె.విజయకుమారి, మండల ఇంజనీరింగ్ అధికారి రామనాథం, హౌసింగ్ ఎఇ మత్స వెంకటేష్ పాల్గొన్నారు.