విజయనగరం

‘మూడంచెల వ్యవస్థ కొనసాగించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 13: ఎంపిటిసి, జెడ్పీటిసి వ్యవస్థను రద్దుచేయాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు చెప్పారు. మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపిటిసి, జెడ్పీటిసి వ్యవస్థను ప్రభుత్వం చేతికి ఆరవ వేలుగా మార్చివేసిందని, వీరికి ఎటువంటి అధికారాలు లేకపోవడంతో రాజకీయ నిరుద్యోగులుగా మారిపోతున్నారని, ప్రజాధనం వృథా అవుతోందన్నారు. ఈ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఎంపిటిసి, జెడ్పీటిసి వ్యవస్థను రద్దుచేయడం మేలని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల అధికారాల బదిలీకి చట్టబద్ధత కల్పించాలని పూంచీ కమిషన్ కేంద్రానికి సిఫారసు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీనికోసం అవసరమైతే మళ్లీ రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పడాన్ని ఆయన తప్పుపడుతూ ఇది స్థానిక సంస్థలను కించపరిచే చర్యగా అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ మహిళా రిజర్వేషన్లు ఒక విడతకు పరిమితం చేయకుండా రెండు విడతల అనంతరం రొటేషన్ విధానాన్ని అమలు చేయాలని, దీనివల్ల ఆయా వర్గాలకు రెండు విడతలు అవకాశాలు లభించి స్థానిక పాలనలో అనుభవంతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఎక్కువ సమయం లభిస్తుందని చెప్పారు. పూంచీ కమిషన్ పంచాయతీ, జిల్లాపరిషత్ వ్యవస్థ మాత్రమే ఉండాలని, మధ్యలో మరో వ్యవస్థవల్ల గందరగోళం ఏర్పడుతుందంటూ వేరే వ్యవస్థ కావాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలేయాలనడం సరికాదని అన్నారు. దేశమంతా ఒకే రకమైన పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండడం మంచిదని, ప్రస్తుత గ్రామ పంచాయతీ వ్యవస్థను కొనసాగిస్తూ గతంలో మాదిరిగా మండల పరిషత్, జిల్లాపరిషత్ చైర్మన్‌లను నేరుగా ఎన్నుకునే విధానం అమలుచేస్తే బాగుంటుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం మాదిరిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్వయం ప్రతిపత్తి కల్పించి ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు జరిగేలా చట్టబద్ధత కల్పించాలని కోరారు. విలేఖరుల సమావేశంలో సంఘం సభ్యులు సత్యం, రమేష్, రాంబాబు పాల్గొన్నారు.