విజయనగరం

అన్నీ సమస్యలే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు),సెప్టెంబర్ 13: అధ్వాన్నంగా రోడ్లు.. ఎక్కడికక్కడే గో తులు..అస్తవ్యస్త డ్రైనేజీ పట్టణ ప్రజానీకాన్ని పట్టిపీడిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తమ సమస్యలు తీరుతాయని ఆశించిన ప్రజలకు తీరని నిరాశ ఎదురవుతోంది. కేంద్ర పౌ ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ని యోజకవర్గం పరిధిలో ఉన్న విజయనగరం మున్సిపాలిటీలో సంవత్సరాల తరబడి అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. మున్సిపల్ పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ మూడు లక్ష ల మంది పట్టణ ప్రజలు ప్రతినిత్యం న రకయాతనలు పడుతున్నారు. మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల నిధులు పుష్కలంగా ఉన్నా అభివృద్ధి పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. అభివృద్ధి పనులను పరుగెత్తించవల్సిన ము న్సిపల్ పాలకవర్గసభ్యులు చోద్యం చూ స్తుండగా, అభివృద్ధిపై అధికార పక్షాన్ని నిలదీయవల్సిన ప్రతిపక్షసభ్యులు నిద్రపోతున్నారు. ఫలితంగా పట్టణ ప్రజలు సమస్యలతో సంగ్రామం చేస్తూ అనేక ఇ బ్బందులకు గురవుతున్నారు. మున్సిప ల్ కౌన్సిల్‌లో పూర్తిస్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ అభివృద్ధిపై దృష్టి సారించ లేకపోతున్నారు. మున్సిపాలిటీ సాధార ణ నిధులు, వివిధ గ్రాంట్ల్ల ద్వారా రోడ్లు, కాలువల నిర్మాణానికి 17.82 కోట్ల రూపాయలతో ఏడాది క్రితం 439 అభివృద్ధి పనులు చేయాలని ప్రతిపాదించ గా, ఇంతవరకు 79 పనులు పూర్తయ్యా యి. ఇంకా 360 పనులు పూర్తి కావల్సి ఉంది. ఈ పనులు ఎప్పటికి పూర్తవుతా యో ఎవరు చెప్పలేకపోతున్నారు. అదేవిధంగా బిఆర్‌జిఎఫ్ నిధుల వినియోగానికి అతీగతీ లేదు.
పట్టణంలో 3.48 కోట్ల రూపాయల బిఆర్‌జిఎఫ్ నిధులతో 65 పనులు చే యాలని ప్రతిపాదించారు. ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. ఈ నిధుల వినియోగంపై ఎవరూ పట్టించుకోవడంలేదు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రా మకృష్ణ కూడా శ్రద్ద చూపడంలేదు. అలాగే 13వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో కూడా కదలిక లేదు. 7.13 కోట్లతో 27 పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే డిసెంబర్ నెలాఖరులోగా ఈ నిధులను వినియోగించకపోతే వెనుక్కి వెళ్లిపోయే ప్రమా దం ఉంది. నాన్‌ప్లాన్ గ్రాంట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు కూడా మోక్షం లభించడంలేదు. నాన్‌ప్లాన్ గ్రాంటు కింద 3.16 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన 49 పనులలో పది పనులు మా త్రమే పూర్తయ్యాయి. మిగతా 39 పను లు పూర్తి కావల్సి ఉంది. ఈ పనులపై కూడా మున్సిపల్ అధికారులు, పాలకు ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 2013-2014 ఆర్థిక సంవత్సరానికి 1.87 కోట్ల రూపాయలతో 42 అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రతిపాదించగా, వాటిలో నాలుగు పనులు పూ ర్తయ్యాయి. ఇంకా 1.52 కోట్ల రూపాయలు ఖర్చు చేయవల్సి ఉంది. 2014- 2015లో స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ కిం ద 1.39 కోట్ల రూపాయలతో 30 పనులను చేయాలని ప్రతిపాదించగా, పది పనులు పూర్తయ్యాయి. ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అభివృద్ధిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.