విజయనగరం

టిడిపి తీరుపై కమలంలో అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 7: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తమకు మిత్రపక్షమే అయినా, తమను ఆ తరహాలో చూడటం లేదనే అసంతృప్తి పార్టీ నాయకత్వంలో, క్యాడర్‌లో బలంగా ఉందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ మాదవ్ అన్నారు. పాలనా వ్యవహారాల్లో, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించటం లేదనే ఆందోళన కిందిస్థాయి శ్రేణుల్లో ఉందని తెలిపారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఇటీవల జరిగిన పార్టీ రాష్టస్థ్రాయి సమావేశంలో చర్చ జరిగిందని, టిడిపి, బిజెపి ముఖ్యనాయకులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి క్యాడర్‌లో అసంతృప్తి తలెత్తకుండా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గురువారం జిల్లాపరిషత్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాధవ్ మాట్లాడుతు రాష్ట్రంలో టిడిపితో బిజెపి మిత్రపక్షంగా కొనసాగుతున్నా పాలనాపరమైన పదవులలో అవకాశాలు కల్పించటం లేదని, కనీసం నియోజకవర్గ స్థాయి దేవాలయాలు, మార్కెట్ కమిటీలలో అవకాశం దక్కటం లేదని, చివరకు జన్మభూమి కమిటీలో కూడా స్థానం కల్పించటం లేదనే అసంతృప్తి పార్టీశ్రేణుల్లో ఉందని అన్నారు. ఈ విషయాన్ని టిడిపి నాయకత్వం దృష్టికి తీసుకువచ్చి పాలనాపరంగా ప్రభుత్వం నియమించే ప్రతి కమిటీలో బిజెపి కనీసం ఒకస్థానం ఇవ్వాలని కోరామని చెప్పారు. అదే విధంగా జన్మభూమి కమిటీల పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుందని, కొత్తగా నియమించే జన్మభూమి కమిటీలలో బిజెపి శ్రేణులకు తగిన ప్రాతినిధ్యం లభిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.
మోదీ ప్రభుత్వం విశాఖ జోన్ ఏర్పాటుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తోందని, పాలనాపరంగా కొత్త జోన్ ఏర్పాటు సాధ్యం కాదని నివేదిక వచ్చినా, రాజకీయ ఒత్తిడి ద్వారా జోన్ సాధనకు కృషి జరుగుతోందని చెప్పారు. రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో ఇతర రాష్ట్రాల ఒత్తిడి బాగా పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కూడా రాష్టప్రార్టీ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
కాగా రిజర్వేషన్లను మార్చాలని బిజెపి భావించటం లేదని మాధవ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం సందర్భంలోనే పదేళ్లకు ఒకసారి రిజర్వేషన్లను సమీక్షించాలని సూచించారని, రిజర్వేషన్ల అమలుపై సమీక్ష తప్ప రిజర్వేషన్లు ఎత్తివేయాలనే ఆలోచన కేంద్రప్రభుత్వానికి లేదని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 14వ తేదీనుంచి పదిరోజులపాటు పార్టీ దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించిందని మాధవ్ తెలిపారు. విలేఖరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, పార్టీ నాయకులు శివప్రసాద్‌రెడ్డి, పైడి వేణుగోపాల్, గోపాలరాజు, సన్యాసిరాజు, నిమ్మక జయరాజు, ముద్దాడ మధు, రఘురాజు తదితరులు పాల్గొన్నారు.

15 నుండి సముద్రంలో చేపలవేట నిషేధం
విజయనగరం(టౌన్), ఏప్రిల్ 7: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సముద్ర తీరంలో ఈ నెల 15నుండి జూన్ 14వ తేదీ వరకు 61 రోజులు చేపల వేటను మరపడవల ద్వారా నిర్వహించడంపై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని మత్స్య శాఖ సంచాలకుడు ఫణిప్రకాష్ గురువారం వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంగించి మరపడవులపై చేపలవేట నిర్వహించిన వారి పడవలు, వలలను స్వాధీనం చేసుకుంటామని, 2,500 రూపాయలు జరిమానాకు గురికావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఏప్రిల్ నుండి జూన్ మాసంలో సముద్రంలో రొయ్యలు, చేపలు గుడ్లుపెట్టి పొదుగుతాయని, మత్స్య సంపద సంవరక్షణలో భాగంగా ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. చేపల నిషేధకాలంలో మత్స్యకారులకు కుటుంబానికి జీవన భృతిగా నాలుగువేల రూపాయలు కల్పించడం జరుగుతుందని అన్నారు. అర్హులైన మత్స్యకారులు ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకం, రేషన్ కార్డు మత్స్యశాఖ ద్వారా రిజిస్ట్రర్ కాబడిన బోటు యజమాని, మత్స్యకార్మికుడు భోగాపురంలో మత్స్యశాఖ అభివృద్ధి అధికారిని సంప్రదించాలని తెలిపారు.

నేటి నుండి దండుమారమ్మతల్లి ఉత్సవాలు
విజయనగరం(టౌన్), ఏప్రిల్ 7: కంటోనె్మంట్‌లో వెలసిన దేవీదండుమారమ్మతల్లి ఉగాది ఉత్సవాలు శుక్రవారం నుండి నిర్వహించేందుకు ఆలయ ఉత్సవకమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకోసం ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణం తోరణాలతో, రంగులతో, విద్యుత్ అలంకరణలతో తీర్చి దిద్దారు. జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాలను ఉగాదినుండి శ్రీకారం చుట్టి ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈనేపథ్యంలో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈనెల ఎనిమిదినుండి 12వ తేదీ వరకుజరిపే ఉత్సవాలు ఉగాదినాడు వినాయక పూజతో ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు మార్గపురి శ్రీనివాసాచార్యులు గురువారం వెల్లడించారు. శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ దంపతులచే జ్యోతి ప్రజ్వలన, వినాయకపూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశస్థాపన, అమ్మవారికి సహస్తక్రుంకుమార్చన పూజలు నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని హోమశాలలో చండీహోమం,నీరాజనం, అమ్మవారి తీర్థప్రసాదాలు భక్తులకు అందచేయడం జరుగుతుందని ఆయన వివరించారు. 12వ తేదీ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం వరకు ఉత్సవాలను భక్తుల సహకారంతో నిర్వహించి, 16న అన్నదానం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని పూజారి తెలిపారు.
విజయనగరం(టౌన్), ఏప్రిల్ 7:కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రాంతీయ పాలకమండలి సమావేశం గురువారం సైనిక పాఠశాలలో జరిగింది. గత ఆరు మాసాలలో పాఠశాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను పాలకమండలి సమావేశం సమీక్షించింది. రానున్న ఆరుమాసాలలో పాఠశాలలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను పాలక మండలి చైర్మన్ తూర్పు నావికాదళ అధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సి ఎస్ బిస్థాకు కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ గ్రూప్ కెప్టెన్ రవికుమార్ వివరించారు. గత ఏడాదిలో విద్యాభివృద్ధికి పాఠశాల సిబ్బంది సహకరించిన విధానాన్ని ప్రిన్సిపాల్ తెలిపారు. కోరుకొండ సైనిక్‌స్కూల్ పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తూర్పు నావికాదళ అధిపతి తెలిపారు. అంతకుముందు విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు.
ఆకట్టుకున్న కవి సమ్మేళనం
విజయనగరం (పూల్‌బాగ్), ఏప్రిల్ 7: పట్టణంలోని కొత్తగ్రహారంలోని గురుదత్తా పాఠశాలలో గురువారం నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనం కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది.విద్యార్ధులు ఉగాదిపై కవితలను చదివి వినిపించారు. ఈసందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకుడు రామానాయుడు పనె్నండు రాశిఫలాలను చదివి వినిపించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీలత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో ఉగాదిని పురస్కరించుకుని ప్రముఖులను సన్మానిస్తున్నామని చెప్పారు.విద్యార్దులచే కవిసమ్మేళాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, ఉపాధ్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.

సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు
విజయనగరం(టౌన్), ఏప్రిల్ 7: జిల్లాలో సాగువిస్తీర్ణం పెంచడానికి శాఖ లవారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ అధికారులు, ప్రణాళిక అధికారులతో ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకంపై సమీక్షించారు. నీటి పరిరక్షణ, పంటల ఉత్పాదకత, పెంపు, సాగువిస్తీర్ణం ఇతర అంశాలపై అధికారులకు లక్ష్యాలు నిర్ధేశించారు. నీరు-చెట్టు కింద వీలైనన్ని ఎక్కువ పనులు ప్రతిపాదించాలని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జెడి లీలావతి, మైక్రో ఇరిగేషన్ పిడి లక్ష్మినారాయణ, సిపి ఓ విజయలక్ష్మి అధికారులు పాల్గొన్నారు.

జియోట్యాగింగ్‌తో పంటల గుర్తింపు
* వ్యవసాయ శాఖ ఎడిఎ అన్నపూర్ణ
దత్తిరాజేరు, ఏప్రిల్ 7: రైతుల వ్యవసాయ భూములలో జియోట్యాగింగ్ ద్వారా మట్టి నమూనాలు సేకరించి వాటిని పరిశీలించి ఆయా భూములలో ఏ ఏ పంటలకు అనుకూలమో రైతులకు తెలియజేస్తామని, గజపతినగరం వ్యవసాయశాఖ సహాయ వ్యవసాయ సంచాలకురాలు అన్నపూర్ణ అన్నారు. గురువారం మండలంలోని పెదమానాపురం, రెడ్డి అనే రైతుకు చెందిన వ్యవసాయ భూమిలో మట్టినమూనాలు సేకరించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తుందని తెలిపారు. ఐదు ఎకరాల పల్లం భూమిలోగాని, ఐదు ఎకరాల మెట్ట్భుమిలో గాని 1500రూపాయల వ్యయంతో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సూచనలు ఇవ్వడం జరుగుతుందని, ప్రస్తుతం రబీ సీజన్‌లో చోడి, నువ్వుల పంట, సాగుచేస్తే 50 నుండి 60 రోజులలో పంటచేతికొస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఓ గోవిందమ్మ, ఎ.ఇఓ నీలాకృష్ణ, ఎంఇఓలు పాల్గొన్నారు.

ఆరోగ్యకర జీవనానికి అవగాహన ముఖ్యం

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 7: ఆరోగ్యకర జీవనానికి మంచి ఆహారపు అలవాట్లు , అవగాహన ముఖ్యమని అదనపుజెసి యుసిజి నాగేశ్వరరావుతెలిపారు. ప్రపంచ ఆరోగ్యదినోత్సవం సందర్భంగా గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్‌నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బందితో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవనంలో మనిషి ఎన్నో వత్తిడులకు గురవుతూనే అనేక వ్యాధుల బారిన పడుతున్నాడని అన్నారు. అందులో అతి ప్రమాదకరమైన వ్యాధి మధుమేహ మని తెలిపారు. ఈవ్యాధి రాకుండా చూసుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని చెప్పారు. మిత ఆహారం, పోషక విలువలు గల పీచు పదార్ధాలు గలిగిన ఆహారపు అలవాట్లు, శారీరానికి తగినంత శ్రమ, వ్యాధిరాకుండా నివారించడానికి మార్గాలని వివరించారు.
ఈవ్యాధి బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారని అన్నారు. వ్యాధిసోకిన వారికి శరీరంలో ముఖ్యమైన భాగాలను దెబ్బతీస్తాయని చెప్పారు. 35 ఏళ్లు దాటిన తరువాత ప్రతీవ్యక్తి నిపుణులైన వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈవ్యాధిపట్ల సరైన అవగాహన ఉంటే ముందుగానే మేల్కొని దరిచేరకుండా నివారించుకోగలగడానికి మార్గాలు మన చేతుల్లో నే ఉన్నాయని అన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి విద్యార్ధులు, స్వచ్ఛంద సంస్ధల నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ జనాభాలో ప్రతీ ఏటా 10లక్షల మంది ఈమధుమేహ వ్యాధి బారిన పడి చనిపోతున్నారని తెలిపారు. ఈపరిస్ధితి నుండి బయట పడటానికి ప్రజల జీవన విధానంలో మార్పులు రావాలని అన్నారు.
మధుమేహం వలన కళ్లు, కిడ్నీలు దెబ్బతింటాయని తెలిపారు. 35 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఈవ్యాధి లక్షణాల పై తనిఖీ చేయించుకోవాలని అన్నారు. వంశపారంపర్యంగా ఈవ్యాధి మన దేశంలో వ్యాపిస్తున్నదని చెప్పారు. పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు లేకపోవటం, తాజాపండ్లు, పోషకవిలువల ఆహారం తీసుకోకుండా జంక్‌ఫుడ్ విపరీతంగా తీసుకుని అసలు శారీరక వ్యాయామం చేయకుండా ఉంటున్న వారు అధికంగా గురవుతున్నారని తెలిపారు. నివారించడానికి రోజూ నడక, పిండి పదార్ధాలు తక్కువగా తీసుకోవాలని సూచించారు. శాఖాహారం తీసుకోవడం మేలని జొన్నలు,సజ్జలు, చిరుధాన్యాలను ఆహారంలో తీసుకోవాలని తెలిపారు. ఆరోగ్యకరమైన అలవాట్లే మధుమేహ వ్యాధినుండి దూరం చేస్తుందని చెప్పారు. ఈసందర్భంగా వివిధ కళాశాలలకు చెందిన నర్సింగ్ విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు సర్ట్ఫికెట్లు ప్రధానం చేసారు. ఈకార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కిషోర్‌కుమార్, శిక్షణావిభాగం వైద్యులు ప్రభాకర్, మాస్‌మీడియా అధికారులు పైడివెంకటరమణ, జయప్రసాద్, మురళీధర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన బతుకుల్లో ‘నవోదయం’
గజపతినగరం, ఏప్రిల్ 7: గిరిజనులలో చైతన్యం తీసుకురావడానికి నవోదయ కార్యక్రమం దోహదపడుతోంది. గజపతినగరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు గజపతినగరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చింతగడ దాసు పర్యవేక్షణలో ఎస్సైలు భాస్కరరావు, మాన్యాలు పలు రూపాలలో గిరిజనులలో చైతన్యం తీసుకువస్తున్నారు. సి కేటగిరి గ్రామాలుగా సారాడవలస, పణుకువలస, వనిజ, పాడివానివలస, కొండలింగాలవలస, కూనేరు, తోటవలస గ్రామాలను గుర్తించారు. ఈ గ్రామాలలో రెవెన్యూ, పోలీసు, మహిళా సంఘాలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఎక్సైజ్ అధికారులు గ్రామ పెద్దలతో కలిపి గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన సదస్సులు నిర్వహించారు. నాటుసారా తాగడంవలన కుటుంబాలపై ఆర్థిక, సామాజిక, ఆరోగ్యంపై, పిల్లలపై గల ప్రభావాన్ని సమగ్రంగా వివరించారు. సామాజిక స్పృహను కలిగించారు. గిరిజన గ్రామాల్లో ఉన్న యూత్ అసోసియేషన్‌ను భాగస్వాములను చేసి సారారహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా సారామహమ్మారి ఎలా కుటుంబాలను పాడుచేస్తుందో తెలిపే ప్లకార్డులు, బ్యానర్స్‌ను చేతపట్టి అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ప్రజల్లో సారామహమ్మారి బారిన పడినవారిలో కనువిప్పు కలుగజేయుటకు, దాని దుష్ఫలితాలను తెలియజేస్తూ ఒక గీతాన్ని ఎస్సై మాన్యాలు వినిపించారు. అనంతగిరి మండలం, మెంటాడ మండలానికి ఆనుకుని ఉన్న గ్రామాల నుండి రవాణా అవుతున్న నాటుసారాను పూర్తిగా అరికట్టడానికి విశాఖపట్నం ఎక్సైజ్ అధికారులు, విజయనగరం డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారులను సంప్రదించి రెండు జిల్లాల అధికారులతో సరిహద్దు ప్రాంతాలలో దాడులు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్పందించిన మహిళా సంఘాలు వారి గ్రామాలలో సారారహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి సహకరించడం వారిలో కనువిప్పుకు నిదర్శనం.
ఆకట్టుకున్న మాన్యాల గీతం :
సారారహిత గ్రామాలకు తీర్చి దిద్దడానికి గజపతినగరం ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మాన్యాలు రచించిన నవోదయం నవోదయం నవశకానికి ఇది నాంది వాచకం అనే గీతానికి ఎక్సైజ్ కమిషనర్ స్పందించి నవోదయ కార్యక్రమానికి ఈగీతాన్ని ఎంపిక చేసారు. రాష్ట్రంలో జరిగే నవోదయ కార్యక్రమాలలో ఈ గీతాన్ని తప్పకుండా ఆలపిస్తారు. ఈ గీతాన్ని రచించిన ఎస్సై మాన్యాలను పలువురు అభినందించారు