విజయనగరం

పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 19: పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ హెచ్చరించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. పట్టణంలో 24వ వార్డు పరిధిలో విటి అగ్రహారంలో సోమవారం ఉదయం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలని, ప్రతిరోజూ ఉదయం నుంచే వార్డులలో పారిశుద్ధ్య పనులను చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య పనులలో అలసత్వం వహిస్తే ఉపేక్షించే ప్రసక్తిలేదని ఆయన హెచ్చరించారు. రోడ్లను శుభ్రపర్చేందుకు డ్రైవింగ్ క్ల్లీనింగ్‌కు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయాలని, పారిశుద్ధ్యంపై తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజును ఆయన ఆదేశించారు. పారిశుద్ధ్యానికి అవసరమైన సామగ్రిని వారం రోజుల్లో కొనుగోలు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని తెలిపారు. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వెంటనే నీటిని తొలగించాలని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు ప్రసాద్, సంతోషికుమారి, 24వవార్డు కౌన్సిలర్ రొంగలి రామారావు పాల్గొన్నారు.