విజయనగరం

ప్రజా సాధికార సర్వే శతశాతం పూర్తికావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 22: ప్రజాసాధికార సర్వే ఈ నెల ఆఖరునాటికి శతశాతం పూర్తికావాలని అధికారులను కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. గురువారం తహశీల్దార్లు, సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్మార్ట్ పల్స్ సర్వే తీరుపై సమీక్షించారు. 81.80 శాతం సర్వేతో జిల్లా స్మార్ట్ పల్స్ సర్వేలో ఏడవ స్థానంలో ఉందని కలెక్టర్ అన్నారు. సర్వే అధికారులు ఈ నెలాఖరునాటికి శతశాతం పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకున్నారు. సర్వే పనులు ఆలస్యానికి కారణాలను ప్రశ్నించారు. సిగ్నల్స్ అందుబాటులో ఉండటం లేదని, ట్యాబ్‌లు సరిపడాలేవని, కొన్ని మరమ్మతులకు గురయ్యాయని సిబ్బంది తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లు హాజరు తక్కువగా ఉండటం గుర్తించిన కలెక్టర్ ఉదయం ఆరు గంటలకే ఎన్యూమరేటర్లు సర్వే ప్రాంతాల్లో హాజరు కావాలని స్పష్టం చేశారు. సర్వే పనులు త్వరితగతిన పూర్తయ్యే బాధ్యతను తహశీల్దార్లు తీసుకోవాలన్నారు. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్ల, పురపాలక సంఘాలలో సర్వే నత్తనడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వే సందర్భంలో అర్హులైన వారిని చంద్రన్న బీమాపథకంలో నమోదు చేయాలని తెలిపారు. ఇ- ఆఫీస్ విధానంలో వారానికి 30 ఫైళ్లను క్లియర్ చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ఈసమావేశంలో జెసి శ్రీకేష్ లఠ్కర్, డిఆర్‌ఓ జితేంద్ర, ఉపకలెక్టర్ శ్రీలత, జిల్లా పౌరసరఫరాల అధికారి శాంతికుమారి పాల్గొన్నారు.