విజయనగరం

అభివృద్ధి పనులను త్వరితంగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 23: పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతంగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ వివేక్‌యాదవ్‌తో సమావేశమయ్యారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. వచ్చేనెలలో పైడితల్లి జాతర జరుగుతున్నందున రోడ్లు, కాలువ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణంలో కోట జంక్షన్ నుంచి ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, గుచీ నుంచి దాసన్నపేట రైతుబజారు జంక్షన్ వరకు, అంబటిసత్రం జంక్షన్ నుంచి కొత్తపేట జంక్షన్ వరకు, సింహాచలం మేడ జంక్షన్ నుంచి బాలాజీ జంక్షన్ వరకు రోడ్ల విస్తరణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. ముఖ్యంగా పెద్దచెరువు సుందరీకరణ పనుల పురోగతిపై దృష్టి సారించాలన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. రోడ్ల విస్తరణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సైలాడ త్రినాథరావు పాల్గొన్నారు.