విజయనగరం

‘శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(పూల్‌బాగ్),అక్టోబర్ 1: పట్టణంలోని దేవి ఆలయాలు, అమ్మవారి ఆలయాల్లో శనివారం శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాలను మామిడితోరణాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు ప్రత్యేకపూజలు జరిపి సామూహిక కుంకుమపూజల్లో పాల్గొన్నారు. పట్టణంలోని రింగ్‌రోడ్డులో ఉన్న జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకపూజలు జరిపారు. వేకువ జామున లక్ష్మీభువనేశ్వరి సహిత సరస్వతీ అమ్మవార్లకు నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం పసుపు కలిపిన పవిత్ర జలంతో లక్ష్మీ,్భవనేశ్వరి, సరస్వతీ మాతలకు హరిద్రాభిషేకం జరిపారు. ఆలయ అర్చకులు ఫణిహారం తాతాచార్యులు, రాంగోపాల్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శారదాసేవాసంఘం సభ్యులు భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. బొండాడవీధిలోని శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వరస్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాల ప్రారంభ సూచనగా తొలుత విఘ్నేశ్వరపూజను జరిపారు. పుణ్యాహవచనం, కలశస్థాపన జరిపారు.అండలూరి సన్యాసిరావు సిద్ధాంతి ఆధ్వర్యంలో శ్రీసూక్త విధంగా పదిమంది దంపతులు కుంకుమపూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ అప్పలబత్తుల సోమరాజు,జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వేముల సురేష్‌బాబు, కార్యదర్శి తాళాబత్తుల శ్రీనివాస్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేలుపు పైడితల్లి అమ్మవారి వనంగుడిలో కొలువైన దుర్గాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారు దుర్గాలమ్మగా భక్తులకు దర్శనమిచ్చారు.వేదపండితులు శంభర శంకరం, తాతారాజేష్ వేద మంత్రాల నడుమ ఆలయ అర్చకుడు రవిప్రసాద్ పూజాదికాలుజరిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భానురాజా పర్యవేక్షణ జరిపారు. పట్టణంలో పలు కూడళ్లలో దేవి విగ్రహాలను నిలిపి పూజలు నిర్వహించారు.

కురుపాం కోటలో
దసరా ఉత్సవాలు ప్రారంభం

కురుపాం, అక్టోబర్ 1: కురుపాం కోటలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్ నివాసం కోటలో ఉత్సవాలు ప్రారంభించారు. కోటలో ఉన్న ఆయుదాలను పల్లకిలో మోసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోటదుర్గ గుడిలో ఉంచి సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. నూఢిల్లీ నుంచి వచ్చిన పురోహితులు ప్రత్యేక వేదమంత్రాలతో పూజలు చేశారు. దసరాపండుగ వరకు ప్రతీరోజూ ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. పూతికవలస జంక్షన్‌లో దుర్గాదేవిని ఏర్పాటుచేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నేరేడువలసలోని మాలతమ్మ గుడి వద్ద ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.