విజయనగరం

గాయత్రిదేవిగా దుర్గాలమ్మ అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(పూల్‌బాగ్),అక్టోబర్ 3: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి వనంగుడిలో కొలువైన దుర్గాలమ్మ అమ్మవారు సోమవారం గాయత్రిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాలమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. వేకువజామున దుర్గాలమ్మ అమ్మ వారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు రవిప్రసాద్ పూజా కార్యక్రమాలను జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు దుర్గాలమ్మవారిని దర్శించుకుని తమ పేరిట పూజలు జరిపించుకున్నారు.

నాడెప్ నిర్మాణాలు వేగవంతం చేయాలి
గజపతినగరం, అక్టోబర్ 3: నాడెప్ వర్మీకంపోస్టు నిర్మాణాలు వేగవంతం చేయాలని ఉపాధి హామీ పథకం ఎపిడి డి.వి.చలం ఆదేశించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజపతినగరం క్లస్టర్ పరిధిలో 2,500 నాడెప్ వర్మీకంపోస్టు నిర్మాణాలు నిర్మించాల్సి ఉండగా, గజపతినగరం మండలంలో 85, బొండపల్లి మండలంలో 90, దత్తిరాజేరు మండలంలో 60, రామభద్రపురం మండలంలో 60, మెంటాడ మండలంలో 120 నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన నిర్మాణ పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణాలు పూర్తి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో రెండు గ్రామాలు ఓడి ఎఫ్ గ్రామాలుగా ప్రకటించారని చెప్పారు. త్వరలో మరో ఏడు గ్రామాలలో ఓడిఎఫ్ గ్రామాలుగా ప్రకటిస్తామన్నారు. మరుగుదొడ్లు నిర్మాణాలు కూడా వేగవంతం చేయాలని అదేశించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ కృష్ణవేణి, ఎపిఓ సత్యవతి పాల్గొన్నారు.