విజయనగరం

ఆకట్టుకునేలా విజయనగరం ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), అక్టోబర్ 7: విజయనగర ఉత్సవాలను పర్యాటకులు, ప్రజలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఉత్సవం నిర్వహించే వేదికలను ఆయన జిల్లా అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15,16,17 తేదీల్లో నిర్వహించనున్న విజయనగరం ఉత్సవాలు ఘనంగా ఉండాలన్నారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లులో అధికారుల బాధ్యతగా ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. సమన్వయంతో ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈసందర్భంగా క్రీడల పోటీలు నిర్వహించే సర్-విజ్జీ స్టేడియంను పరిశీలించి ఇక్కడ క్రీడల పోటీలు, క్రికెట్ మ్యాచ్ ఏర్పాటుచేసి పోటీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు, ఆసక్తిగల పురప్రజలు పాల్గొనే విధంగా చూడాలని, పోటీలను రౌండ్‌రాబిన్ పద్ధతిలో నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సంస్కృత కళాశాలను పరిశీలించి కళాశాలలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆనందగజపతి ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జిల్లా కళాకారులతో జానపద కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉండే విధంగా చూడాలన్నారు. గురజాడ కళాభారతి వేదికలో నాటికలు, నాటకాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రేక్షకులు కూర్చునేందుకు సౌకర్యవంతంగా ఆవరణను అభివృద్ది చేయాలన్నారు. ఉత్సవ ప్రారంభం రోజున ఆయోధ్య మైదానంలో వెయ్యి మంది కళాకారులతో కూచిపూడి నృత్యప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఉత్సవాలలో ఆద్యంతం విజయనగరం చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలు రూపొందించి ప్రదర్శించాలని తెలిపారు. జిల్లాకు సంబంధించిన ప్రత్యేక గీతం, నృత్య ప్రదర్శన నిర్వహించాలని తెలిపారు. జిల్లా వాసులతోపాటు జిల్లాతో అనుబంధం ఉన్న ప్రముఖులను ఉత్సవ వేడుకల్లో పాల్గొనే విధంగా ఆహ్వానించాలని కలెక్టర్ వివేక్ సూచించారు. ఈ ఉత్సవాలు ప్రతి ఒక్కరివి అనే భావన ప్రజల్లో తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏజెసి నాగేశ్వరరావు, డిఎస్‌డిఓ సూర్యారావు, సెట్విజ్ అధికారి దుర్గారావు, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ లింగేశ్వరరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసమూర్తి, సంస్కృతి కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నహైందవి, ఐవిపిరాజు, గజపతిరాజు,చంటిరాజు పాల్గొన్నారు.