విజయనగరం

ఎన్నికల్లో గెలుపే అజెండాగా టిడిపి సమన్వయంలో చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), అక్టోబర్ 13: త్వరలో జరిగే పట్ట్భద్రుల నియోజకవర్గ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికలు, స్ధానిక సంస్థల ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థ్ధుల విజయమే లక్ష్యంగా కృషి చేయాలని టిడిపి జిల్లా కమిటీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. కంటోనె్మంట్‌లోని జెడ్పీ అతిథిగృహంలో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ జగదీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా మంత్రి మృణాళిని పాల్గొన్నారు. పార్టీ సంస్ధాగత అంశాలతోపాటు ఎన్నికలపై పార్టీ సమన్వయ కమిటీ సమావేశం చర్చించింది. పార్టీ ముఖ్యనేతలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను, సూచనలు పరిగణనలోకి తీసుకుని కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా పట్ట్భద్రులైన ఓటర్లను నమోదు చేయించడంలో చురుకైన పాత్ర తీసుకోవాలని, పాత ఓటరు జాబితా రద్దయిన నేపథ్యంలో కొత్తగా విద్యావంతులైన వారు, గతంలో ఓటరుగా నమోదైన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలని పార్టీ నేతలకు జగదీష్ తెలిపారు. ఇందుకు ఒకో నియోజకవర్గానికి పార్టీనుండి ఒకరిని సహాకునిగా పంపాలని నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ, ఎంపిటిసి ఉపఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆయా నియోజకవర్గ నాయకులకు దిశా నిర్ధేశం చేశారు. నామినేటెడ్ పదవులకు ఎంపిక విషయంలో సమన్వయ కమిటీ సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈసమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయడు, సుజయ్‌కృష్ణరంగారావు, కెఎనాయుడు, మీసాలగీత, బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీలు సంధ్యారాణి, గాదెశ్రీనివాసులనాయడు, తెలుగు మహిళా అధ్యక్షురాలు హైమావతి, జిల్లా ప్రధానకార్యదర్శి ఐవిపిరాజు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు భంజ్‌దేవ్,తెంటు లక్ష్మునాయుడు, తూముల భాస్కరరావు, గద్దెబాబూరావు,జడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి పాల్గొన్నారు.