విజయనగరం

సిరిమాను ఉత్సవంలో వెండి చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), అక్టోబర్ 13: శ్రీపైడితల్లి అమ్మవారి ఉత్సవంలో ఈ ఏడాది జాలరి వల గొడుగుకు వెండి చేప ప్రధాన ఆకర్షణగా బెస్తలు సిరిమాను ఉత్సవంలో పాల్గొంటామని బెస్తలు ఎం.రామగోపాలం, రామకృష్ణ వెల్లడించారు. గురువారం పట్టణంలోని బెస్తవీధిలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారు పెద్దచెరువులో జాలర్ల వలలో దొరికిన నాటినుండి పూర్వీకులు ఈ సిరిమాను ఉత్సవంలో చేపబొమ్మను వల పైభాగాన ఉంచి ఊరేగింపు ఉత్సవంలో పాల్గొనే వారని, అయితే బెస్త సామాజికవర్గం చేసిన నిర్ణయం మేరకు అందరూ సమకూర్చిన విరాళాలతో సుమారు 50 కిలోల వెండి వినియోగించి నూతనంగా చేప ఆకారాన్ని తయారు చేయించామని తెలిపారు. తొలేళ్ల పండుగ నాడు ఈ వెండి చేపను ర్యాలీగా అమ్మవారి ఆలయం వరకు తీసుకువెళ్లి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతియేటా ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. జాలర్లకు రాజుల కాలంనాటి నుండి ఉత్సవంలో పాల్గొనేందుకు గుర్తింపు ఉండటం సంతోషమని తెలిపారు. ఆనాడు పెద్దచెరువులో అమ్మవారు వలకు దొరికినప్పుడు జాలర్లను ఏమి వరం కావాలో కోరుకోమంటే ఉత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారన్నారు. ఆనాటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతుందని చెప్పారు. ఈ ఏడాది నుండి వెండి చేపతో జాలరి వల ఉత్సవంలో ఆకర్షణగా ఉండనుందని తెలిపారు. తొలేళ్లనాడు జరిగే ర్యాలీలో బెస్తలు పాల్గొనాలని కోరారు. ఈకార్యక్రమంలో పేరిశెట్టి గున్న, కృష్ణారావు, సూరిబాబు, వెంకటేశ్వరరావు, వెంకటేష్ కామరాజు పాల్గొన్నారు.