విజయనగరం

ఉత్సవాల బందోబస్తుకు పక్కా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), అక్టోబర్ 13: విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఉత్సవాలలో భద్రత విషయంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా పటిష్టవంతమైన నిఘ పెట్టాలని చెప్పారు. జేబుదొంగలు, అల్లరిమూకల నుండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా డేగకళ్లతో నిఘా ఉంచి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ట్రాఫిక్, క్యూలైన్ల నిర్వహణలో సమస్యలు రాకుండా చర్యలు తీపుకోవాలని తెలిపారు. ఈ ఉత్సవాలలో బందోబస్తుకు రేంజ్ పరిధినుండి రెండువేలకు పైగా బలగాలను మొహరించనున్నామని చెప్పారు. పట్టణాన్ని 17 సెక్టార్లుగా విభజించి రెండు షిప్టులతో బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. ఇద్దరు ఎస్పీలు, 10 డిఎస్పీలు ఇతర జిల్లాల నుండి ఏడుగురు డి ఎస్పీలు, 24 మంది సిఐలు, 76 మంది ఎస్సైలు ఇతర భద్రతా దళాలతో తగిన బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఈసమావేశంలో ఎస్పీ లేళ్ల కాళిదాసురంగారావు, అదనపు ఎస్పీ ఆపరేషన్స్ వెంకట అప్పలనాయుడు, ఎవి రమణ, డిఎస్పీలు పాల్గొన్నారు.