విజయనగరం

గిరిజన ఆవాసాలకు దోమతెరల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), అక్టోబర్ 17: జిల్లాలోని గిరిజన ఆవాసాల్లో నివసించే ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రామీణ పారిశుద్ధ్య కమిటీలకు విదేశాల నుండి జిల్లాకు రప్పించిన దోమతెరలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది గిరిజన మండలాల్లో నివసించే ప్రజలు, విద్యార్థులకు దోమతెరలు అందజేస్తామని తెలిపారు. దోమల వలన సంక్రమి ంచే వ్యాధుల బారినుండి కాపాడేందుకు ఇవి రక్షణగా ఉంటాయని చెప్పారు. రెండు లక్షల మందికి పైగా గిరిజనులు, ఐదువేలకు పైగా విద్యార్థ్ధులకు ఇవి గ్రామీణ పారిశుద్ధ్యకమిటీల ద్వారా 18వ తేదీ నుండి పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇవి సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ గతంలో నిలిపివేసిన కార్యక్రమాన్ని తిరిగి అమలు చేశామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తొలివిడతలో గిరిజన మండలాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. దోమతెరల వినియోగంపై మండలాల్లో కళాజాతా ద్వారా ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. ఈ ఏడాదిలో జ్వరాల కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదని తెలుపుతూ ఇంతవరకు 2093 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు. సుమారు 71182 దోమతెరలు జిల్లాకు వచ్చాయని చెప్పారు. ఈకార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యే మీసాలగీత, జెసి శ్రీకేష్ లఠ్కర్, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి పద్మజ, జిల్లా ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్, జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు మలేరియా నివారణ అధికారి రవికుమార్ పాల్గొన్నారు.