విజయనగరం

ఉపాధి అమలులో సీతానగరం ఫస్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతానగరం, ఏప్రిల్ 10: ఉపాధిహామీ పథకం అమలులో సీతానగరం మండలం ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు డ్వామా అధికారులు ఇందుకు సంబంధించిన నివేదికను విడుదల చేశారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 5వేల 448 కుటుంబాలకు వంద రోజుల పనులు కల్పించడంతోపాటు గిట్టుబాటు కూలీ కల్పించడంలో కూడా ఉత్తమ పనితీరు కనబరిచిందని నివేదికలో పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా చేపడుతున్న సామగ్రి పనులు, లేబర్ బడ్జెట్ చేరుకోవడంలోనూ ఇక్కడి ఉపాధి అధికారులు మంచి పనితీరు కనబరిచినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి ఎపివో హరనాథ్‌కు జిల్లా ఉపాధి అధికారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎపివో మాట్లాడుతూ ప్రజా ప్రతినిదులు, అధికారుల సహకారంతో సకాలంలో లక్ష్యాన్ని చేరుకున్నట్టు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా మరింత ప్రగతి సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు.