విజయనగరం

ఉపాధి హామీ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), అక్టోబర్ 21: ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథకం అధికారులు, ఎంపిడిఓలు, టెక్నికల్ సహాయకులు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంటకుంటల నిర్మాణాలు అనుకున్నంతగా పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎంపిడిఓలు పథకాల అమలులో సరైన విధంగా నాయకత్వం వహించాలన్నారు. వర్మీ కంపోస్టు,నాడెప్ కంపోస్టు,సోక్‌పిట్ నిర్మాణాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మొక్కలు నాటే కార్యక్రమం, వాటర్ హార్వెస్టింగ్, ఎన్టీఆర్ జలసిరి పనుల ప్రగతిని కలెక్టర్ మండలాల వారీగా సమీక్షించారు. ఎన్టీఆర్ జలసిరిలో లబ్ధిదారుడు కేవలం 18 వేల రూపాయలు ఖర్చు చేస్తే రెండు లక్షల రూపాయల లబ్ధి పొందే పథకం దేశంలోనే అత్యుత్తమమైనదని కలెక్టర్ అన్నారు. ఈపథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. సర్పంచ్ నుండి జెడ్పీటిసి వరకు రైతులను ప్రోత్సహించడంలో ముందుండాలన్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని, రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఎన్టీఆర్ జలసిరి ఫేజ్-2 కింద సోలార్ పంపుసెట్లకు మాత్రమే కేటాయింపులు మంజూరు చేయాలన్నారు. 3-హెచ్‌పి మోటారుతో బోరు ఏర్పాటుకు 2,89,200, 5-హెచ్‌పి మోటారుతో బోరు ఏర్పాటుకు 3.69,300 ఖర్చుకాగా ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులు కేవలం 4,500 చెల్లించాలని, అదే ఇతరులు 18వేల రూపాయలుతమ వాటాగా చెల్లించాలని తెలిపారు. ఇప్పటివరకు అనుమతులు ఇచ్చిన 148 బోర్లను నవంబరు 15వతేదీ నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.
కస్తూరిబా పాఠశాల ఘటనపై కలెక్టర్ ఆరా
కస్తూరిబాగాంధీ విద్యాలయం సంఘటనపై కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆరా తీశారు. మెరకముడిదాంలోని కెజిబివి పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి వాకబు చేశారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనులపై సమీక్షిస్తున్న కలెక్టర్ మెరకముడిదాం మండల సమీక్ష సందర్భంలో ఆహారం కలుషితం సంఘటన వివరాలు తెలుసుకున్నారు. 34మంది విద్యార్థ్ధులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలుకావడం సంఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఐదుగురు విద్యార్థ్ధులు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం ఆరా తీసిన ఆయన అందుకు బాధ్యులైన అధికారులను వదిలిపెట్టేది లేదని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డ్వామా పిడి ప్రశాంతి, జెడ్పీ సిఇఒ రాజకుమారి, విద్యుత్‌శాఖ ఎస్‌ఇ చిరంజీవిరావు, డిపిఓ సత్యనారాయణరాజు పాల్గొన్నారు.