విజయనగరం

12 నుండి పాఠశాల విద్యార్థులకు పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 10: పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి ఉత్తర్వుల మేరకు ఈనెల 12వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు నిర్వహించే ఎస్ ఎ-3 సమ్మెటివ్(యాన్యువల్) పరీక్షలు యధావిధిగా నిర్వహించాలని జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డి ఇ ఓ కృష్ణారావు ఆదివారం ఆదేశాలు జారీ చేసారు. సమ్మిటివ్ పరీక్షలు నిర్వహణ వేళలు ఉదయం 7.30 గంటల నుండి 10.15 నిమిషముల వరకు మొదటి సెషన్, ఉదయం 11 గంటల నుండి 1.45గంటల వరకు రెండవ సెషన్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలలో పేర్కొన్నారు. పాఠశాలలకు ఈనెల 24వ తేదీ నుండి వేసవి సెలవులుగా తెలియజేసారు.

ప్రశాంతంగా ఆదర్శపాఠశాల ప్రవేశపరీక్ష
గజపతినగరం, ఏప్రిల్ 10: గజపతినగరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఆదర్శపాఠశాల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మండలంలోని మరుపల్లి ఆదర్శపాఠశాల ప్రిన్సిపాల్, పరీక్షల చీఫ్ ఎన్ను అప్పారావు పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శపాఠశాల ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు 215మంది పరీక్ష రాయాల్సి ఉండగా 204 మంది మాత్రమే పరీక్ష రాసారని తెలిపారు. 11మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని చెప్పారు. పరీక్షల సూపరింటెండెంట్‌గా మండల విద్యాశాఖాధికారి కె బి ఆర్ ఆచార్యులు వ్యవహరించారు.