విజయనగరం

అందరికీ ఆరోగ్యం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 23: ప్రజారోగ్యం పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని రాష్ట్ర ప్రజారోగ్య వేదిక కన్వీనర్ డాక్టర్ ఎస్.సురేష్ అన్నారు. ఆదివారం ఇక్కడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘అందరికీ ఆరోగ్యం, అవకాశాలు, అవరోధాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం ప్రసాదించాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరికీ ఆరోగ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తించినప్పటికీ నేటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి సరిపడా నిధులు కేటాయించడంలో విఫలమవుతున్నాయని అన్నారు. నేడు దేశంలో 90 శాతం ప్రజలు తమ ఆదాయంలో 30 నుంచి 40 శాతం మందుల కోసం వెచ్చిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి పోవాలంటే ప్రభుత్వం ప్రజారోగ్యం పరిరక్షణకు అధిక నిధులు కేటాయించాలన్నారు. దేశంలో స్థూల జాతీయోత్పత్తిలో 2.5 శాతం ఆరోగ్యానికి కేటాయించాల్సి ఉండగా, నేటికి 1.02 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర బడ్జెట్‌లో 8 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, 3 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవని చెబుతూనే కార్పొరేట్ సంస్థలకు, మెడాల్‌కు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుందన్నారు. రాష్ట్రంలో రెండు జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు లేవని చెప్పారు. వాటిలో విజయనగరం, ఏలూరు రెండు చోట్ల ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ నిధులు లేవన్న సాకుతో చేతులెత్తేసిందన్నారు. మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నప్పటికీ వాటికి అవసరమైన నిధులు వెచ్చించకపోవడం వల్ల నిర్వీర్యంగా ఉన్నాయన్నారు. కాగా, కార్పొరేట్ సంస్థలకు రోజుకు పరీక్షల కోసం రూ.40 నుంచి 40 లక్షలు వెచ్చిస్తుందని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వంపై ఓత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజయ్‌శర్మ మాట్లాడుతూ నేడు మహిళలు, ఆదివాసీలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సరిపడా పోషకాహారం లభించకపోవడమే కారణమన్నారు. దీనిని నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అధిక నిధులు కేటాయించి వాటిని బలోపేతం చేయాలన్నారు. మాజీ ఎంపి, డాక్టర్ డివిజి శంకరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు ఎదుర్కొనే సమస్యలకు ప్రైవేటీకరణ పరిష్కారం కాదు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలన్నారు. నాయకులు అధికారంలోకి రాక ముందు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తామని, అధికారంలోకి వచ్చాక వాటిని నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైద్య విధాన్‌పరిషత్ సంఘం నాయకుడు సురేష్ మాట్లాడుతూ వచ్చే బడ్జెట్‌లోనైనా ప్రభుత్వం ప్రజారోగ్యానికి సరిపడా నిధులు కేటాయించాలని, ప్రభుత్వంపై ఓత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌విఆర్ కృష్ణారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసా, సిపిఎం పట్టణ కమిటీ కార్యదర్శి రెడ్డి శంకరరావు పాల్గొన్నారు.