విజయనగరం

గుట్టుచప్పుడు కాకుండా కుట్టుమిషన్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 23: పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం గుట్టుచప్పుడు కాకుండా మహిళలకు కుట్టుమిషన్‌లను పంపిణీ చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మీసాల గీత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్‌కు, పాలకవర్గసభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదు. సమాచారం అందకపోయినా కమిషనర్‌తోపాటు కొంతమంది పాలకవర్గ సభ్యులు హాజరై మొక్కుబడిగా పాల్గొన్నారు. ఈ విషయంలో మెప్మా అధికారుల అనుచితవైఖరిపై పాలకవర్గసభ్యులు మండిపడుతున్నారు. కమిషనర్‌కి, పాలకవర్గసభ్యులకు కనీస సమాచారం అందించక పోవడం దారుణమని వారు వాపోతున్నారు. పట్టణంలో శుక్రవారం మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ చినతాతయ్య పర్యటించినప్పుడు కూడా కనీస సమాచారం ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెప్మా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తిలేదని వారు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కుట్టుమిషన్‌ల పంపిణీలో ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మెప్మా ప్రాజెక్టుడైరెక్టర్ కె.ప్రకాష్, పట్టణ ప్రాజెక్టు అధికారి సరోజని, మున్సిపల్ పాలకవర్గసభ్యులు పిన్నింటి కళావతి, రౌతు పద్మ, ఆల్తి రాధ పాల్గొన్నారు.