విజయనగరం

ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(్ఫర్టు), అక్టోబర్ 28: నష్టాలతో నడుస్తున్న ఆర్టీసీని పరిరక్షించేందుకు ప్రభుత్వం ఆర్ధికంగా చేయూత అందించాలని ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు చెలసాని వెంకట రామారావు డిమాండ్ చేశారు. కష్టాలలో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం అందించడంలేదన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని, పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా శుక్రవారం ఇక్కడ ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన రామారావు మాట్లాడుతూ అధికారుల ఏక్షపక్ష నిర్ణయాలే ఆర్టీసీ నష్టాలకు ప్రధాన కారణమని ఆరోపించారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు, ఉద్యోగులు కారణం కాకపోయినప్పటికీ, యాజమాన్యం ఆ భారాన్ని కార్మికులపైనే నెట్టివేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం, యాజమాన్యం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలవల్లే ఆర్టీసీ నష్టాలతో నడుస్తుందని ఆరోపించారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెదమజ్జి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్‌ఎంయు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదన్నారు.
గుర్తింపుసంఘంగా ఎన్నికై పది నెలలు గడుస్తున్నా కార్మికుల హక్కులు, ఆర్టీసీ పరిరక్షణ కోసం ఎటువంటి కృషి చేయడం లేదని చెప్పారు. రీజనల్ కమిటీ కార్యదర్శి పి.్భనుమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు మేరకు షెడ్యూల్ పదిలో పేర్కొన్న విధంగా ఎపిఎస్‌ఆర్‌టిసికి రావల్సిన న్యాయపరమైన ఆస్తుల వాటా విలువ 800 కోట్ల రూపాయలు వచ్చేలా రాష్ట్రప్రభుత్వం, యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రీజనల్ కోశాధికారి జి.రవికాంత్, డివిజన్ కార్యదర్శి టిఎస్‌ఎన్‌రాజు, జోనల్ కోశాధికారి వి.ప్రసాదరావు, జోనల్‌కమిటీ సభ్యుడు టివి నాయుడు పాల్గొన్నారు.