విజయనగరం

నిర్వాసితుల పునరావాసం జిఓ అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 10: జిల్లాలో అమలులో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వాసితులకు పునరావాసం పూర్తిస్థాయిలో జి ఓ ప్రకారం అమలు చేయాలని ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎం వి ఎస్ శర్మ కలెక్టర్‌ను కోరారు. ఆదివారం ఆయన సిపి ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం కృష్ణమూర్తితో కలసి ఈమేరకు కలెక్టర్ ఎం ఎం నాయక్‌కు వినతి పత్రం అందజేసారు. అనంతరం ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ శర్మ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో తోటపల్లి, తారకరామతీర్థసాగర్, పెద్దగెడ్డ తదితర ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసం కల్పించే సందర్భంలో జి ఓ నెం. 60 పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదని అన్నారు. జిఓలోని 3-10( ఎ) ప్రకారం 18 సంవత్సరాలు నిండిన మగ, ఆడపిల్లలను ప్రత్యేక కుటుంబాలుగా పరిగణించి ఆర్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని కానీ తోటపల్లి, పెద్దగెడ్డ, తారకరామ ప్రాజెక్టులలో నిర్వాసిత ఆడపిల్లలకు ఈ జి ఓ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసారు. 2013 పునరావాస చట్టం కింద ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు ఉద్యోగం లేదా ఐదు లక్షల పరిహారం, నెలకు రెండు వేల రూపాయల చొప్పున నెలకు 20 సంవత్సరాల పాటు పింఛన్ చెల్లించాలని తెలిపారు. పునరావాసంలో భాగంగా ఇంటి నిర్మాణానికి 50వేల రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిందని ఆసొమ్ము పునాదులు తీయడానికి కూడా చాలదని అన్నారు. నిర్మాణ వ్యయాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచాలని కోరారు. ప్రభుత్వం నిర్వాసితుల విషయంలో సానుకూలంగా స్పందించాలని పోలవరం నిర్వాసితులకు ఏవిధంగా అమలుచేస్తున్నారో జిల్లాలోని నిర్వాసితులకు వాటిని వర్తింప చేయాలని కోరారు.