విజయనగరం

టిడిపిలో నిస్తేజం వైకాపాలో నిర్వేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం , నవంబర్ 2: పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందడంలేదని తెలుగుదేశం కార్యకర్తలు నిస్తేజంలో ఉండగా, ప్రతిపక్షంలో ఉండటంవల్ల ఎటువంటి ప్రయోజనంలేదని వైకాపా కార్యకర్తలు నిర్వేదంలో ఉన్నారు. విజయనగరం పట్టణంలో టిడిపి జనచైతన్యయాత్రలకు కార్యకర్తలు దూరంగా ఉండగా, గడపడపకూ వైకాపా చేపడుతున్న పర్యటనలకు పార్టీ కార్యకర్తలు విముఖత చూపుతున్నారు. ఆయా కార్యక్రమాలలో పాల్గొనేందుకు కార్యకర్తలు ముఖం చాటేస్తుండటంతో ప్రజల దృష్టిని రెండుపార్టీల నాయకులు ఆకర్షించలేకపోతున్నారు. రాష్టవ్రిభజన తర్వాత భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు జనచైతన్యయాత్రల పేరిట టిడిపి, గడపగడపకూ వైకాపా పేరిట వైకాపా నాయకులు ప్రజల ముందుకు వెళుతున్నారు. రెండు పార్టీల నాయకులు ప్రజాభిమానాన్ని చూరగొనలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు జనచైతన్యయాత్రలను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుండగా, ప్రభుత్వవైఫల్యాలను ఎండగడుతూ గడపగడపకూ వైకాపాను ప్రతిపక్షపార్టీ చేపడుతోంది.
రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రూపురాజకీయాలు చోటుచేసుకోవడం, కార్యకర్తలు ఆసక్తి కనబర్చకపోవడం, ప్రజలు దృష్టి సారించకపోవడం వల్ల కార్యక్రమాలు తూతూమంత్రంగా సాగుతున్నాయి. విజయనగరం పట్టణంలో ఎమ్మెల్యే మీసాల గీత(టిడిపి)ఆధ్వర్యంలో జరుగుతున్న జనచైతన్యయాత్రలు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి(వైకాపా) నేతృత్వంలో నిర్వహిస్తున్న గడపగడపకూ వైకాపా కేవలం కరపత్రాల పంపిణికే పరిమితం అవుతున్నాయి. టిడిపికి కంచుకోటగా ఉన్న 3,4, 15, 16 వార్డులలో నిర్వహించిన జనచైతన్యయాత్రలలో పార్టీ వార్డుస్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్దగా పాల్గొనలేదు. కొంతమంది దిగువస్థాయి నాయకులు, కార్యకర్తలు హాజరైనప్పటికీ మొక్కుబడిగా పాల్గొన్నారు. ఫలితంగా ప్రజలు కూడా చైతన్యయాత్రలపై అంతగా అసక్తిచూపలేదు. వార్డులలో పర్యటిస్తూ కరపత్రాలను పంపణీ చేయడానికే పరిమితమైన ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించడంలో ఘోరంగా విఫలమయ్యారు. జనచైతన్యయాత్రలలో ఎమ్మెల్యే గీతతోపాటు మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సైలాడ త్రినాధరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మద్దాల ముత్యాలరావుపాల్గొంటున్నారు. అడపా దడపా వార్డుస్ధాయి నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరవుతున్నారు.
ఇక వైకాపాలోనూ పరిస్థితి ఇంతే ఘోరంగా ఉంది. వైకాపా జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న గడపగడపకూ వైకాపాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వైఫల్యం చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపువేణుతోపాటు కొంతమంది నాయకులు మినహా, సీనియర్ నాయకులు హాజరుకావడంలేదు. పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వర్గీయులైన మజ్జి శ్రీనివాసరావు, పిళ్లా విజయకుమార్, యడ్ల రమణమూర్తితోపాటు అవనాపుబ్రదర్స్ దూరంగా ఉన్నారు. ఇక్కడ వైకాపాలో రెండుగ్రూపులు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. స్వపక్షంలోనే కోలగట్లకు సవాల్ విసురుతూ తలనొప్పిగా తయారవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా గ్రూపురాజకీయాలు ఉన్నప్పటికీ బయటపడటం లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రజల అభిమానాన్ని చూరగొనడంలో రెండు పార్టీల నాయకులు విఫలమవుతున్నాయి.

వేతన బకాయిలు చెల్లించకుంటే సమ్మె తప్పదు
* మున్సిపల్ వర్కర్స్, ఎంప్లారుూస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 2: పట్టణానికి మంచినీరు సరఫరా చేసే ముషిడిపల్లి, నెల్లిమర్ల పంపుహౌస్ కార్మికులకు వేతన బకాయిలు చెల్లించకపోవడంతో నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లారుూస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ తెలిపారు. పట్టణంలో ఎల్‌బిజి భవన్‌లో బుధవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత్యంతరం లేని పరిస్థితులలో సమ్మె చేయవల్సి వస్తుందని చెప్పారు. ఇందుకు పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఆరునెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పంపుహౌస్ కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేతనాలను చెల్లించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మున్సిపల్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా స్ట్రీట్‌లైటింగ్‌లో 16 మంది కార్మికులు 15 ఏళ్లగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇందులో 8 మందికి పని చూపించి మిగతావారిని రోడ్డుపైకి నెట్టివేశారని చెప్పారు. కార్మికులందరికీ పని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పనిచేసున్నవారికి మూడునెలలుగా వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. నెలల తరబడి వేతన బకాయిలను చెల్లించకపోవడం వల్ల ఎలా పనిచేయాలో కార్మికులకు అర్థం కావడంలేదన్నారు. ఈ నేపధ్యంలో గురువారం నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు జగన్నాధరావు,రాంబాబు, అప్పారావు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే టిడిపి ధ్యేయం
* పార్టీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి శత్రుచర్ల
గరుగుబిల్లి, నవంబర్ 2: అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు మం జూరు చేయడమే తెలుగుదేశం ప్రభు త్వం ధ్యేయమని కురుపాం నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇన్‌చార్జ్జి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. రాష్టప్రార్టీ ఆదేశాలమేరకు బుధవారం మండల పరిధిలోని గరుగుబిల్లి, గొట్టివలస, ఉల్లిభద్ర, కొంకడివరం గ్రామాల్లో జనచైతన్యయాత్ర నిర్వహించారు. ఈ సం దర్భంగా మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి ధనుంజయరా వు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్ర జల్లోకి తీసుకువెళ్లేందుకు జనచైతన్యయాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మె ల్యే విటి.జనార్ధన్ థాట్రాజ్ మాట్లాడు తూ సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధిపై సమీక్షించడంతోపాటు గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనచైతన్యయాత్ర నిర్వహిస్తార న్నారు. ఈ మేరకు యాత్రలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గంట ఉషాసరస్వతి, మాజీ ఎంపిపి మర్రాపు పురుషోత్తంనాయుడు, టిడిపి నాయకు లు అక్కేన మధుసూదనరావు, బంకురు శంకరజోగినాయుడు, డొంకా డ రామకృష్ణ, ఎడ్ల శ్రీనివాసరావు, నల్ల తిరుపతినాయుడు పాల్గొన్నారు.

జనజీవన స్రవంతిలోకి రండి
* ఎస్పీ కాళిదాసు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 2: ఇటీవల విశాఖ జిల్లా సరిహద్దులో జరిగిన పోలీసు కాల్పుల్లో ఎవరైనా గాయాలపాలైన మావోలు ఉంటే వారు ముందుకు వస్తే వారికి అవసరమైన వైద్యం అందిస్తామని జిల్లా ఎస్పీ కాళిదాసు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా లేదా ఉపాధ్యాయుల ద్వారా తనకు సమాచారం అందిస్తే తాము అవసరమైన సాయం అందిస్తామన్నారు. జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు వచ్చిన వారిపై ఎలాంటి కేసులు ఉండబోవని స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోలకు ప్రభుత్వం కల్పించే అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. మావోలు కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకొని వేలాడకుండా సమాజంలో సమస్యల పరిష్కారానికి ప్రజలు, ప్రభుత్వాధికారులతో కలసి పనిచేయడమే సరైన మార్గమన్నారు. అజ్ఞానాన్ని, అజ్ఞాతాన్ని విడనాడి వారు ముందుకు రావాలన్నారు. జనజీవన స్రవంతిలో కలసిన మావోలు కూడా చదువుకొని ప్రభుత్వం ఇనే్చ రాయితీలు వినియోగించుకొని వారి కాళ్లమీద వారు నిలబడిన వారు ఎందరో ఉన్నారన్నారు. జనజీవన స్రవంతిలో కలసిన వారు ప్రజాజీవితం నచ్చకపోతే మళ్లీ ఉద్యమం వైపు వెళ్లి ఉండేవారు కదా అని ఆయన ప్రశ్నించారు. ఇంతవరకు ఆ విధంగా వెళ్లిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం, పోలీసులు ఏదొక వర్గానికి సంబంధించిన వారు కాదని గుర్తు చేశారు. ఒక వ్యక్తిని లేదా కుటుంబాన్నో, వర్గాన్నో లక్ష్యంగా పెట్టుకొని ప్రతీకారేచ్ఛతో రగిలిపోవడం అర్ధరహితమన్నారు. నేటికి గిరిజన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్న విషయాన్ని గ్రహించి మావోలు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం
* జెడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ స్వాతిరాణి

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 2: ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని జెడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి అన్నారు. పట్టణంలో 15, 16 వార్డులలో బుధవారం జరిగిన జనచైతన్యయాత్రలలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వాతిరాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో అమలవుతుందన్నారు. సామాజిక న్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నా, కొన్ని రాజకీయపార్టీలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధికి అడుగడుగునా అడ్డు తగులుతున్నారని తెలిపారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా ప్రజా సంక్షేమాన్ని ఆపలేరన్నారు. ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతూ ప్రతిపక్షాల కుట్రలో చిక్కుకోకుండా ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలను కోరారు. ఆర్థికంగా రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా అభివృద్ధి, సంక్షేమంలో ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. నన్యాంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, మాజీ చైర్‌పర్సన్ కనకమహాలక్ష్మి, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు, పట్టణ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మద్దాల ముత్యాలరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సైలాడ త్రినాధరావు, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు వెంకట నరసింగరావు, మున్సిపల్ కౌన్సిలర్లు ముద్దాడ చంద్రశేఖర్, మైలపిల్లి పైడిరాజు, రౌతు పద్మ పాల్గొన్నారు.

జై ఆంధ్ర సభను విజయవంతం చేయాలి
* వైకాపా కేంద్ర నాయకుడు, మాజీ మంత్రి సాంబశివరాజు
నెల్లిమర్ల, నవంబర్ 2: ఆంధ్ర ప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఈ నెల 6వతేదీన విశాఖలో వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభను విజయవంతంచేయాలని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు కోరారు. బుధవారం మండలంలోని మొయిద గ్రామంలో సాంబశివరాజు స్వగృహంలో నెల్లిమర్ల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ అధినేత జగన్మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. విశాఖలో నిర్వహించనున్న సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మద్దతు తెలిపాలన్నారు. ఈ సభలో నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాయకులు విబేధాలు వీడి హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేవరకు విశ్రమించరాదన్నారు. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జిల్లా నాయకులు మజ్జిశ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టిడిపి అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. అర్హులైన వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు సామాజిక పింఛన్లు చేశారని జనచైతన్య యాత్రల పేరిట గ్రామాల్లోకి వెశుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ సురేష్‌బాబు, నాయకులు అంబళ్ల శ్రీరాములునాయుడు, చనమల్లవెంకటరమణ, పతివాడ సత్యనారాయణ, నక్కాన వెంకటరావు, పతివాడ అప్పలనాయుడు, కె.వి.వి.సత్యనారాయణ పాల్గొన్నారు.

కలెక్టర్ అభివృద్ధి పనుల పరిశీలన
గుర్ల, నవంబర్ 2: మండలంలోని గుర్ల గ్రామంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ అభివృద్ధి పనులను బుధవారం కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా బిసి కాలనీలో చేపట్టనున్న సిసిరోడ్లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. గుర్ల గ్రామానికి ఎన్ ఆర్ ఇజిఎస్ ద్వారా 80లక్షల రూపాయలతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులు నాణ్యతాలోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అండర్ డ్రైనేజీ సిసి రోడ్లు పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల జెఇ ఉమా మహేశ్వరరావు సమాధానం ఇస్తూ అండర్ డ్రైనేజీ ద్వారా పారిశుద్ధ్య లోపం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి సభ్యురాలు తిరుమలరాజు పద్మిణి, ఎంపిపి జమ్ము సత్యం, వెనె్న సన్యాసినాయుడు, టి.కిరణ్‌కుమార్ రాజు, సర్పంచ్ వెంకటలక్ష్మి, ఎంపిటి ఓ తహశీల్దార్ పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా పోరాడతాం
* బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు దేవర ఈశ్వరరావు
గజపతినగరం, నవంబర్ 2: వెనుకబడిన తరగతుల సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా పోరాడతామని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు దేవర ఈశ్వరరావు అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నూతనంగా నియమించబడిన అధ్యక్షులకు నియామక పత్రాలను దేవర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కులాల వారు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని చెప్పారు. బిసిలకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు దశల వారీగా పోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్ర అథ్యక్షుడు కృష్ణయ్య ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ముద్దాడ మధు సూచనల మేరకు నూతన బిసి కార్యవర్గాన్ని నియమించామని చెప్పారు. గజపతినగరం,బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ మండల శాఖ అధ్యక్షులుగా సామంతల పైడిరాజు, కొయ్యాన ప్రసాద్, సారిక అప్పలనాయుడు, కోడెల ముత్యాల నాయుడులను నియమించామని చెప్పారు. నియమితులైన ప్రతినిధులు ఆయా మండలాల పరిధిలోని బిసిల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దొగ్గ దేవుడునాయుడు, నాయకులు సామంతల పైడిరాజు, అప్పలాచారి, అచ్చెన్న, రామునాయుడు పాల్గొన్నారు.

హామీల అమలుపై టిడిపి నేతలను నిలదీయాలి
* మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య
బొండపల్లి, నవంబర్ 2: ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై గ్రామాలకు వచ్చే టిడిపి నాయకులను నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని ఎం.కొత్తవలస, మరువాడ గ్రామాలలో గడపగడపకూ వైకాపా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రావడానికి అమలుకాని హామీలు ఇచ్చారని విమర్శించారు. మహిళలను, రైతులను యువతలను మోసగించారని విమర్శించారు. టిడిపి నాయకులు గ్రామాల్లోకి వస్తే హామీలు అమలుపై నిలదీయాలని కోరారు. మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మించిన చంద్రబాబును ప్రజ లు విశ్వసించడంలేదన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ విషయంలో మమ్మల్ని సైతం నిలదీయవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు ప్రజలకు వివరించడానికే గడపగడపకూ వైకాపా నిర్వహిస్తున్నామన్నారు. ఎంపి నిధులు కింద ఏడాదికి ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ఆ నిధులు ఎంతవరకు ఖర్చు చేశారని ప్రశ్నించారు. మహిళలు, రైతులకు ప్రభుత్వం చేసిన వంద తప్పుల కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఈదుబిల్లి కృష్ణ, మాజీ ఎంపిపి రాపాక సూర్య ప్రకాశరావు, జిల్లా సర్పంచ్ సంఘం మాజీ అధ్యక్షుడు తాళ్లపూడి కృష్ణ, సర్పంచ్ అప్పలనాయుడు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

తెరపైకి మరో రెండు రెవెన్యూ డివిజన్లు
* బొబ్బిలి, చీపురుపల్లి కేంద్రాలుగా ప్రతిపాదనలు
* మంత్రి మృణాళిని
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 2: రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ప్రస్తుతం జిల్లాలో విజయనగరం, పార్వతీపురం రెవెన్యూ డివిజన్లు ఉండగా మరో రెండింటికి ప్రతిపాదనలు చేశారు. చీపురుపల్లి, బొబ్బిలి రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ప్రతిపాదనలు చేసినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి మృణాళిని తెలిపారు. చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల, గజపతినగరం, బొండపల్లి, మెంటాడ మండలాలు ఉంటాయి. అలాగే బొబ్బిలి రెవెన్యూ డివిజన్ పరిధిలో బొబ్బిలి, బాడంగి, రామభద్రాపురం, దత్తిరాజేరు, బలిజేపేట, సాలూరు, పాచిపెంట, తెర్లాం మండలాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం విజయనగరం డివిజన్ పరిధిలో 19 మండలాలు, పార్వతీపురం డివిజన్‌లో 15 మండలాలు ఉన్న విషయం విధితమే. రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల