విజయనగరం

చక్కెర ఫ్యాక్టరీ రైతులకు న్యాయం చేయకుంటే ఆందోళన చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, నవంబర్ 4: లచ్చయ్యపేట చక్కెర ఫ్యాక్టరీ రైతులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని రైతు సంఘం అధ్యక్షుడు వేమురెడ్డి లక్ష్ముంనాయుడు హెచ్చరించారు. స్థానిక రైతు సంక్షేమ సంఘం కార్యాలయంలో శుక్రవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెరకు రైతులకు యాజమాన్యం చెల్లిస్తున్న మద్దతు ధర చాలడం లేదని, దీంతో పలు ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వాలు కూడా యాజమాన్యంతో కుమ్మక్కై చెరకు రైతులకు అన్యాయం చేస్తున్నట్టు హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరకు రైతులకు కనీస మద్దతు ధర అందించే విధంగా చర్యలు చేపట్టాలని, ఇందుకు యాజమాన్యంతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయరంగం నానాటికి నిర్వీర్యం అవుతోందని, దీనిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పంచధార రేట్లు ఎక్కువ అవుతున్నా చెరకు మద్దతు ధర పెంచడంలో పాలకులు, యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. మద్దతు ధర 3 రూపాయలకు తక్కువ లేకుండా చర్యలు చేపట్టాలని, పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘాల నాయకులు రామినాయుడు, లక్ష్మణరావు, సత్యనారాయణ, తిరుపతిరావు పాల్గొన్నారు.