విజయనగరం

నేడు కేంద్ర మంత్రి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 5: కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు ఆదివారం ఉదయం 11 గంటలకు పట్టణానికి చేరుకుంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 4.30 గంటలకు బొండపల్లి మండలంలో ఏర్పాటు చేసిన జనచైతన్య యాత్రలో పాల్గొంటారు. 7న ఉదయం డెంకాడ మండలం పెదతాడివాడలో ఏర్పాటు చేసిన టిడిపి జనచైతన్య యాత్రలో పాల్గొంటారని టిడిపి జిల్లా అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. సాయంత్రం విజయనగరం నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు.
నేడు ప్రభుత్వ విప్ రాక
ఎపి లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఆదివారం ఉదయం 11 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 12 గంటలకు విజయనగరం చేరుకుంటారు. మధ్యాహ్నాం 12.30 గంటలకు రామనారాయణంలో ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విశాఖ మీదుగా హైదరాబాద్ చేరుకుంటారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 5: జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి మృణాళిని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు స్థలాలు మంజూరైనప్పటికీ నిర్మాణాల్లో జాప్యం తగదన్నారు. అభివృద్ధి పనులకు మంజూరైన స్థలాలను వెంటనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించాలన్నారు. శనివారం రాత్రి కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గరివిడిలో మోడల్ కళాశాల నిర్మాణం కోసం మంజూరైన స్థలాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించాలన్నారు. దాంతోపాటు ఆసుపత్రి నిర్మాణానికి మంజూరైన స్థలాన్ని కూడా వారికే అప్పగించాలని సూచించారు. ఘన వ్యర్థ పదార్ధాల నిర్వహణకు ఒక ఎకరా స్థలాన్ని అందజేయాలని సంబంధిత తహశీల్దార్‌ను ఆదేశించారు. ఇదిలా ఉండగా రామభద్రాపురంలో రైతు బజారు నిర్మాణానికి మంజూరైన పది ఎకరాల స్థలాన్ని ఎఎంసి, తహశీల్దార్ ద్వారా వైద్య ఆరోగ్యశాఖ ఇంజనీరింగ్ అధికారులకు అందజేయాలన్నారు. చీపురుపల్లి పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలకు మరికొంత స్థలాన్ని సేకరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్థలాలను అప్పగించిన వెంటనే పనులు చేపట్టాలన్నారు. నిర్మాణాలలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జెసి లఠ్కర్, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, ఆర్డీవో శ్రీనివాసమూర్తి, డిపిఒ సత్యనారాయణరాజు, డిఎంహెచ్‌ఒ పద్మజ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీ రేట్లకే
మద్యం విక్రయించాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 5: జిల్లాలో మద్యాన్ని ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టరేట్‌లో జిల్లా ఎక్సైజ్ కమిటీ, రెవెన్యూ, పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ అధికారులు చిత్తశుద్ధి, నిబద్ధతతో పనిచేయాలన్నారు. బెల్టు షాపులను నియంత్రించాలన్నారు. మద్యాన్ని నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయించే దుఖాణాలపై కేసులు నమోదు చేయాలన్నారు. ఆకస్మిక తనిఖీలు జరపాలని సూచించారు. అధికారులు ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా ఉండాలన్నారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు మద్యం విక్రయించడం వల్ల ప్రజలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇదిలా ఉండగా నవోదయం కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. నాటుసారా నిర్మూలన వంటివి చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎల్‌వికె రంగారావు మాట్లాడుతూ అక్రమ మద్యం, బెల్టు షాపులు నియంత్రణ వల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు. పోలీసు శాఖ ద్వారా బెల్టుషాపులపై దాడులు నిర్వహించి 311 కేసులు నమోదు చేసినట్టు వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది 1280 రోడ్డు ప్రమాదాల్లో 350 మంది మృత్యువాతపడ్డారన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ టి.నాగలక్ష్మి మాట్లాడుతూ ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విక్రయిస్తున్న 15 దుకాణాలపై కేసులు నమోదు చేసి జరీమానా విధించడంతోపాటు లైసెన్సులు రద్దు చేసినట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు శ్రీనివాసమూర్తి, గోవిందరావు, ఎక్సైజ్‌శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ త్యాగరాజు, పార్వతీపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ విక్టోరియారాణి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వధ్యేయం
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 5: ప్రజల సంక్షేమమే ప్రభుత్వధ్యేయమని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. జనచైతన్యయాత్రలో భాగంగా విజయనగరం మండలం జమ్ము, బియ్యాలపేటలలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వినూత్నతరహాలో పాలనలో సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎక్కడా వెనుకడుగు వేయలేదని అన్నారు. నవ్యాంధ్రపదేశ్ నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న చంద్రబాబునాయుడికి ప్రజలు అండదండలు అందించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వవలసిన ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేయడం తగదన్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రతిక్షాలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. రైతులకు, డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సైలాడ త్రినాధరావు, జెడ్పీటీసి తుంపల్లి రమణ, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు వెంకట నరసింగరావు, మండల పార్టీ అధ్యక్షుడు బొద్దుల నరసింగరావుతదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల పెంపుతో
ప్రభుత్వంపై అధిక భారం
మెరకముడిదాం, నవంబర్ 5: పేదలకు పంపిణీ చేస్తున్న పింఛన్లు ఐదు రెట్లు పెంపుదల చేయడంతో ప్రభుత్వంపై అధికభారం పడుతుందని రాష్ట్ర గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రి కిమిడి మృణాలిని అన్నారు. శనివారం మండలంలోని గరుగుబిల్లి, రాచపేట, రాచగుమడాం, భీమవరంలలో జన చైతన్యయాత్ర గ్రామ సభలు నిర్వహించారు. ఇందులో భాగంగా రాచపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇస్తున్న పింఛను 5 రెట్లు పెంపుదలతో ప్రభుత్వంపై అధికభారం పడినప్పటికీ వాటిని కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పటికే అర్హులైనవారందరకీ పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని అర్హత కలిగి పింఛను రాని వారెవరైనా ఉంటే ఈ జనచైతన్య యాత్రలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. మరుగుదొడ్డి నిర్మించుకున్న లబ్ధిదారునికి తక్షణమే బిల్లు చెల్లించడం జరగుతుందన్నారు. అనంతరం భీమవరంలో గ్రామ సభ ఏర్పాటుకు ముందు మండల పార్టీ అధ్యక్షుడు జవహార్‌రాజు మృతిపట్ల నివాళులర్పించారు. అలాగే భీమవరం గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ జవహార్‌రాజ్ ఈ జనచైతన్య యాత్రలకు లేకపోడం తీరని లోటన్నారు. అనంతరం గ్రామ సమస్యలపై ప్రపంగించారు. అలాగే గరుగుబిల్లి, రాచగుమడాంలలో ఈ జనచైతన్య యాత్రలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉనుకూరు మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు, మండల అధ్యక్షులు తాడ్డి సన్యాసినాయుడు, జెడ్పీటీసీ పెందుర్తి సింహాచలంతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తక్షణమే పాఠశాల శిథిల భవనాలు తొలగించాలి
బొండపల్లి, నవంబర్ 5: మండలంలో వివిధ గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు తక్షణమే తొలగించాలని స్థానిక జెడ్పీటీసీ బండారు బాలాజీ ఆదేశించారు. శనివారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మండలాధ్యక్షురాలు పిరిడి ఎల్లమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మండలంలో 16 ప్రాథమిక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయని మండల విద్యాశాఖ అధికారి నర్సింగరావు తెలియజేయగా ఇంతవరకు ఎన్ని పాఠశాలల భవనాలు తొలగించారని ప్రశ్నించారు. ఇంత వరకు ఆరు భవనాలు తొలగించామని ఎంఇఓ చెప్పగా ప్రమాదాలు జరగకముందే అధికారులు భవనాల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి కె. రవీంద్ర మాట్లాడుతూ రాయితీపై పెసర, మినుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విద్యుత్ సమస్యలు గ్రామాలలో తీరలేదని బి. రాజేరు, ఎం. కొత్తవలస, కెరటాం గ్రామాల సర్పంచ్‌లు సభ దృష్టికి తీసుకువచ్చారు. బి. రాజేరులో విద్యుత్ లో ఓల్టేజీ సమస్య అధికంగా ఉందని ఎంపిటిసి పాశల సీతారాం ఫిర్యాదు చేసారు. తహశీల్దార్ నీలకంఠరావు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ లోగా ప్రజా సాధికారిత సర్వే ముగుస్తుందని వలసదారులను సర్వే పరిధిలోకి తెచ్చేందుకు ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. అలాగే నవంబర్ ఐదుతో పట్ట్భద్రుల ఓటర్లు నమోదు కార్యక్రమం పూర్తవుతుందని, అయితే కేవలం పట్ట్భద్రులు డిగ్రీ ధృవ పత్రాలు ఫొటో అందజేస్తే సరిపోతుందని చెప్పారు. జడ్పీటిసి బండారు బాలాజీ మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసినపుడే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని అన్నారు. ఈ సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బొడ్డురాము, ఐసిడిఎస్ సిడిపిఓ ప్రసన్న, ఎంఇఓ నర్సింగరావు, ఎపిఎం పెంటమనాయుడు, విద్యుత్ శాఖ ఎఇ కాశీబాబు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే సుజయ్
బొబ్బిలి (రూరల్), నవంబర్ 5: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. మండలం రంగరాయపురం, పెంట, జె.రంగరాయపురం, ఎం.బూర్జివలస, కొత్తపెంట పంచాయతీల్లో శనివారం జనచైతన్యయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వపథకాలు అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మరింత కృషి చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్దికి ప్రతీఏటా లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అన్ని గ్రామాలకు వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ దేశంపార్టీ ఇన్‌చార్జ్ తెంటు లక్ష్ముంనాయుడు మాట్లాడుతూ జనచైతన్యయాత్రల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ చేయూతనందించాలన్నారు. అంతమంది కలిసిమెలసి అభివృద్ధిబాటలో పయనించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యులు గౌరమ్మ, సర్పంచ్‌లు చొక్కాపు నారాయణరావు, బేతనపల్లి విజయలక్ష్మి, ఎంపిటిసి సభ్యులు వి.రామారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీలతో అధికారులను హడలెత్తించిన కలెక్టర్
గంట్యాడ, నవంబర్ 5: మండలంలో శనివారం పర్యటించిన కలెక్టర్ వివేక్ యాదవ్ ఆకస్మిక తనిఖీలతో అధికారులు గుండెల్లో రైళ్లు పరుగుపెట్టాయి. పలు పథకాలను పరిశీలించిన ఆయన అడుగడుగునా అసంతృప్తి వ్యక్తం చేసారు. ముందుగా మండలంలోని గంట్యాడ గ్రామంలోని జడ్పీటి ఉన్నత పాఠశాలను తనిఖీ చేసారు. నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదుల భవన సముదాయాన్ని పరిశీలించినే ఆయన అడుగడుగునా నిర్మాణాలలో లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కనిపిస్తోందని మండిపడ్డారు. భవన నిర్మాణ పనులు ఏమీ బాగోలేదని అన్నారు. గచ్చులుగానీ, ప్లాస్టింగ్ గాని జరగని అసంపూర్తి భవనంలో విద్యార్థులకు ఎలా తరగతులునిర్వహిస్తున్నారని హెచ్ ఎంను ప్రశ్నించారు. భవన నిర్మాణ పనులు ప్రారంభించి చాలా కాలం అయినా ఇంకా పూర్తికాలేదని కాంట్రాక్టర్‌కు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా పట్టించుకోలేదని ఉపాధ్యాయులు కలెక్టర్‌కు తెలిపారు. దీంతో భవనం నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుందని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ప్రశ్నించినా సమాధానం స్పష్టంగా చెప్పక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంట్రాక్టర్‌కు వెంటనే షోకాసు నోటీసు ఇచ్చి ఫైన్ వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పాఠశాలలో ఈటాయిలెట్లును పరిశీలించిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఉన్న టాయిలెట్లు నిర్వహణ బాగాలేదని అవి కూడా బాలికలకు అయితే బాలురకు ఏవని ప్రశ్నించారు. హెచ్ ఎం ఇచ్చిన వివరణలో కలెక్టర్‌కు సంతృప్తి కలిగించలేక పోయారు. కంప్యూటర్ ల్యాబ్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహిస్తున్న డిజిటల్ క్లాసులు పరిశీలించారు. విద్యార్థులతో దాదాపు 15 నిమిషాలపాటు మాట్లాడి ఉపాధ్యాయుని పాత్ర పోషించారు. పలు విషయాలపై విద్యార్థులను ప్రశించి వారి మేథా సంపత్తిని తెలుసుకున్నారు. తదుపరి గంట్యాడ, బోనంగి గ్రామాలలో జరుగుతున్న స్మార్టు ఫల్స్ సర్వే తమను పరశించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ డిఇఓ లింగేశ్వరరావు, ఎంపిడిఓ దూసిరవి, తహశీల్దార్ బాపిరాజు, ఎంఇఓ శంకరరావులు పాల్గొన్నారు.
రాష్ట్భ్రావృద్ధికి అందరూ సహకరించాలి
కొత్తవలస, నవంబర్ 5: రాష్ట్భ్రావృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని సంతపాలెం, దెందేరు, గురివిందాడ, గనిశెట్టిపాలెం, గొల్లలపాలెం, చీడివలస గ్రామాలలో జన చైతన్య యాత్రలు చేపట్టారు. ప్రతి గ్రామంలోను ఎమ్మెల్యేకు స్వాగతం పలికేందుకు ప్రజలు పోటీ పడ్డారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. బాబుకు అండగా మనందరం ఉండాలని కోరారు. ఒకవైపు ప్రజా సంక్షేమాన్ని మరువకుండా, మరోవైపు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు అడ్డు తగులుతున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధించి ప్రజలకు 24 గంటలు విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. అదే విధంగా ఎక్కడ లేని విధంగా పింఛన్లు, రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ, ఉద్యోగ కల్పన పలు సంఘాల ద్వారా యువకులకు రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు టిడిపి సభ్యత్వం తీసుకుని వ్యక్తిగత బీమా పొందాలని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, కార్యకర్తలు, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అంబులెన్స్‌లో ప్రసవం
మక్కువ, నవంబర్ 5: మండలంలోని శీబిల్లి పెద్దవలస గ్రామానికి చెందిన గాడి ఎల్లారం భార్య గాడి వసంత శనివారం పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే 108 వాహనానికి సమాచారం అందజేయగా 108 వాహనంపై ఆసుపత్రికి తీసుకువెళుతున్న సమయంలో శంబర గ్రామ సమీపంలో నొప్పులు ఎక్కువ కావడంతో వాహనాన్ని రోడ్డుపక్కకు తీసి ఆశావర్కరు దేవరత్నం, 108 సిబ్బంది ఇఎంటి జి.సింహాచలం, పైలెట్ శ్యాంసుందరరావులు ప్రసవం చేయించారు. వసంతకు మూడవకాన్పులు మగ శిశువు జన్మించింది. వెంటనే తల్లి, బిడ్డలను మామిడిపల్లి పిహెచ్‌సికి తరలించారు.
8న ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఛలో విజయవాడ
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 5: సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగులు నెల 8న ఛలో విజయవాడ కార్యక్రమం తలపెట్టినట్టు ఎపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధి అప్పలసూరి తెలిపారు. ఈ మేరకు శనివారం గోడపత్రికను ఆవిష్కరించారు.
ప్రజా చైతన్యంతోనే ప్రభుత్వ పథకాలు ఫలవంతం
గరివిడి, నవంబర్ 5: ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సద్వినియోగం కావడానికి ప్రజా చైతన్యం అవసరమని మండల పార్టీ అధ్యక్షుడు పైలబలరామ్ అన్నారు. శనివారం మండలంలోని కుమరాం జన చైతన్య యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించడంతోపాటు, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి జన చైతన్య యాత్రలు దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై గ్రామస్తులు అందించిన వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్ ఇ సి ఎస్ వైస్ చైర్మన్ సురేష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బలగం శ్రీనివాసరావు, ఎంపిటిసి సభ్యుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.