విజయనగరం

విద్యార్థులకు వినోద యాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 6: విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా వినోద యాత్రల ద్వారా మరికొంత విజ్ఞానాన్ని పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తొంది. ఈ ఏడాది తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాలల విద్యార్థులను వినోద యాత్రలకు తీసుకెళ్లాలని ఆదేశించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొ విద్యార్థికి రూ.200 చొప్పున నిధులు మంజూరు చేసింది. దీనివల్ల రాష్ట్రంలో 2651 పాఠశాలల నుంచి 1,69,455 మంది విద్యార్థులు లబ్ధిపొందారు. ఇప్పటి వరకు విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం గాక వారిలో మానసిక ఉల్లాసం కలిగించేందుకు వినోద యాత్రల పేరిట ఆయా జిల్లాల్లో ఉన్న చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ ఆలయాలు, మ్యూజియంలు, విహార ప్రాంతాలకు తీసుకెళ్లాలని సూచించింది. కార్తీక మాసం కావడంతో విద్యార్థులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు వినోద యాత్రలకు తీసుకెళ్లాయి. విద్యార్థులను బీచ్‌కు తీసుకెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఒక్కొ విద్యార్థికి ఇందుకోసం రూ.200 కేటాయించింది. ఈ మొత్తంతోనే విద్యార్థికి బస్సు ఛార్జీలు, అల్పాహారం, మధ్యాహ్నా భోజనం, తాగునీరు కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు ఇటువంటి యాత్రలకు తీసుకెళ్లడం ద్వారా విద్యార్థుల్లో మరింత ఉత్సాహం కలగనుంది. ఇటువంటి యాత్రల వల్ల విద్యార్థులు ప్రత్యక్ష పద్దతిలో విజ్ఞానాన్ని నేర్చుకునేందుకు అవకాశం కలిగింది. దాంతోపాటు మానసిక ఉల్లాసానికి ఇటువంటి యాత్రలు దోహదపడతాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం కాగలవని పలువురు భావిస్తున్నారు.