విజయనగరం

స్వచ్ఛమైన పాలన టిడిపికే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, నవంబర్ 6: స్వచ్ఛమైన పాలన తెలుగుదేశం పార్టీకే సాధ్యపడుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. ఆదివారం సాయంత్రం బొండపల్లిలో జన చైతన్యయాత్రలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ దిశగా పనిచేస్తుందన్నారు. విధులు, నిధులు కేంద్ర ప్రభుత్వం వాటాకింద 42 శాతం గ్రామాల అభివృద్ధి కూడా చేశామన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి కేంద్రం నిధులు ఐదు శాతం అందజేస్తుందని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి స్కామ్‌లు లేకుండా పరిపాలన సాగిస్తున్నదని అన్నారు. తల్లిపిల్ల కాంగ్రెస్ రాష్ట్రాన్ని అథోగతి పాలు చేసిందని విమర్శించారు. గత పాలనకు, ప్రస్తుత పాలనకు వ్యత్యాసం ఆలోచించాలని మంత్రి ప్రజలను కోరారు. విజయనగరం మండలం ద్వారపూడి గ్రామ స్ఫూర్తితోనే పంచాయతీల విద్యుత్ ఆదా అవుతుందని స్పష్టం చేశారు. నేలపైన చదువున్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 60వేల మంది విద్యార్థులకు బెంచీలు సమకూర్చామని, నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని మాట్లాడుతూ 2018 నాటికి ప్రతి ఇంటికి దీపం కనెక్షన్లు ఇవ్వడమే ప్రభుత్వ థ్యేయమని అన్నారు. 2004 సంవత్సరానికి ముందు నిర్మించిన బలహీనవర్గాల గృహాలకు పదివేల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. డ్వాక్రా మహిళలకు రెండో విడత పెట్టుబడి నిధి కింద మూడు వేలు జమచేస్తారని చెప్పారు. సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఐదేళ్లకు సుమారు 30వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతుందన్నారు. తొలుత గెద్దపేట గ్రామానికి సుమారు 20లక్షల ఖర్చుతో నిర్మించనున్న రోడ్డుకు మంత్రులు అశోక్, మృణాళినిలు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బొండపల్లిలో సుమారు రూ. 2.35కోట్లతో నిర్మించిన సిసి రోడ్లు, కాలువలకు ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంటిరాజు, జడ్పీటిసి బండారు బాలాజీ, ఎంపిపిలు పిరిడి ఎల్లమ్మ, గంట్యాడ శ్రీదేవి, మండల పార్టీ అధ్యక్షుడు కోరాడ కృష్ణ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రావి శ్రీధర్, ఎంపిటిసిలు సూర్యనారాయణమ్మ, శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ వర్రి సత్యవేణి పాల్గొన్నారు.

తాటిపూడిలో పర్యాటకుల సందడి
గంట్యాడ, నవంబర్ 6: ప్రముఖ పర్యాటక కేంద్రమైన తాటిపూడి రిజర్వాయర్ ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. ఇక్కడ విహారయాత్ర కోసం పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఆటపాటలు, కేరింతలు, తుళ్లింతలతో ఎంతో సందడి చేసారు. తాటిపూడి ప్రకృతి అందాలు వీక్షించి తన్మయం చెందారు. పిల్లపాపలతో పలు వాహనాలలో తరలివచ్చిన పర్యాటకులు మధ్యాహ్నం వరకు తాటిపూడి పరిసర ప్రదేశాలలో కలియదిరిగారు. అనంతరం వనభోజనాలు చేశారు. జలాశయం ప్రత్యేక ఆకర్షణగా ఉన్న బోటు షికారు కోసం పర్యాటకులు ఎగబడ్డారు. బోటులో షికారు చేసి సహజ అందాలను వీక్షించి పులకరించారు. జలాశయం నుంచి టూరిజం బోట్‌లో మరో పర్యాటక ప్రాంతమైన గంటికొండ గిరివినాయక వనవిహారం తరలివెళ్లారు. పిక్నిక్ సీజన్ కార్తీక మాసంలో మొదటి ఆదివారం ఇదే కావడంతో పర్యాటకులు భారీగా వచ్చారు. రోజంతా సరదాగా గడిపేందుకు తాటిపూడివద్ద సరైన సదుపాయాలు లేకపోవడం పర్యాటకులకు అసంతృప్తి కలిగించింది.