విజయనగరం

లెక్కలు తేల్చరు.. పరిష్కారం చేయరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 8: జిల్లాలో స్థానిక సంస్థలలో కుప్పలు, తెప్పలుగా ఆడిట్ అభ్యంతరాలు పేరుకుపోయాయి. నిధుల వినియోగానికి సంబంధించి సరైన లెక్కలు తేల్చకపోవడంతో సంవత్సరాల తరబడి అభ్యంతరాలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. రాజకీయాలు, పరిపాలనకు కేంద్ర బిందువైన జిల్లా ప్రజాపరిషత్‌లో ఆడిట్ అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా మొత్తం మీద జెడ్పీ, మండల పరిషత్, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో 3,283 అభ్యంతరాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ 24.66 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అయితే సంవత్సరాల తరబడి అభ్యంతరాలను పరిష్కరించడంలో ఆడిట్ అధికారులు, స్ధానిక సంస్ధల అధికారులు తగిన శ్రద్ద చూపడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. జెడ్పీ అధికారులు ఆడిట్ అభ్యంతరాలను ఎందుకు పరిష్కరించుకోవడం లేదో అర్ధం కావడంలేదని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా వినియోగించిన ఖర్చుల వివరాలు తేలడంలేదు. నిధుల వినియోగానికి అభ్యంతరాలను 100 రోజుల్లో పరిష్కరించుకోవాలని కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అధికారులలో ఏమాత్రం కదలిక కనిపించడంలేదు. జెడ్పీలో ఇంజనీరింగ్ అధికారులు ఎం.బుక్‌లను అందజేయకపోవడం వల్ల 75 శాతం అభ్యంతరాలు పెండింగ్‌లో ఉండగా, మిగతా 25శాతం పాలనాపరమైన సమస్యలవల్ల పేరుకుపోయాయి. జిల్లాలో స్థానిక సంస్థలలో నిధుల వినియోగానికి కనీస ప్రమాణాలు, మార్గదర్శిక సూత్రాలను పాటించలేదని కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్(కాగ్) తప్పు పట్టింది. నిధుల వినియోగానికి ధ్రువప్రతాలు, ఇతర వివరాలను అందించలేదని ఎత్తి చూపింది. జెడ్పీలో 50.83 లక్షల రూపాయల రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సి) నిధులను వినియోగించకపోవడం, జెడ్పీ అతిథిగృహంలో వౌలిక సదుపాయాలను కల్పించేందుకు విడుదల చేసిన 32.28 లక్షల రూపాయల ఖర్చుకు వినియోగ ధ్రువపత్రాలు, ఎం.బుక్‌లను సమర్పించకపోవడాన్ని తప్పు పట్టింది. కొత్తవలస వారపుసంత వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో మండల పరిషత్, గ్రామపంచాయతీలకు అందవల్సిన వాటాలో 42.38 లక్షల రూపాయలను పంపిణీ చేయకపోవడాన్ని ఎత్తి చూపింది. జెడ్పీలో కాంట్రాక్టర్లకు చట్టబద్దంగా మినహాయించవల్సిన ఆదాయం పన్ను, వ్యాట్ తదితర 9.18 లక్షల రూపాయల పన్నులను మినహాయించక పోవడాన్ని కూడా తప్పు పట్టింది. రాష్ట్రీయ స్వయం వికాస్ యోజనలో సిమెంటు, ఐరన్ ధరల వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోకుండా 22.96 లక్షల రూపాయలు, యంత్రాల కొనుగోలులో 6.34 లక్షల రూపాయల అధికంగా చెల్లింపులు జరిగినట్లు గుర్తించింది. పాచిపెంట మండల పరిషత్‌లో వాహనం(జీపు) అద్దె చెల్లించకుండా, గొట్టపుబావుల రిజిస్ట్రేషన్ జరగకుండా ఖర్చు చేసిన 1.39 లక్షల రూపాయల అభ్యంతరాలు వెలుగుచూశాయి. ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో ప్రభుత్వం విడుదల చేసే నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.