విజయనగరం

దశలవారీగా హామీలన్నీ నెరవేరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, నవంబర్ 8: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా నెరవేరుస్తామని జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి, రాష్ట్ర ఐటి శాఖామాత్యులు పల్లె రఘునాథరెడ్డి అన్నారు. మంగళవారం జనచైతన్య యాత్రలో భాగంగా ఎస్.కోట మండలం తిమిడి గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ. ఐదురెట్లు పింఛన్లు, పండగలకు చంద్రన్న కానుకలు, ఎన్టీఆర్ జలసిరి చంద్రన్న బీమా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. 29 నెలల్లో 16వేల కోట్లు లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ ప్రజలకిచ్చిన మా టను నిలబెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 84లక్షల మంది రైతులకు రూ.24వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉపాధి హామీ నిధులపై నడుస్తుందన్నారు. ప్రజలకు అర్థమైన రీతిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేయాలన్నారు. వెంకటరమణపేట జంక్షన్ నుండి తిమిడి, వసి మీదుగా 14వ ఆర్థిక సంఘంద్వారా అన్ని పంచాయతీలకు నిధులు అందించామన్నారు. తెలివైన సర్పంచ్‌లందరు నిధులను వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాలని అన్నారు. విజయనగరం జిల్లాకు ఎక్కువ మొత్తంలో నిధులు ఇచ్చామని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కొత్తూరు వద్ద 2.90కోట్లుతో బిటి రోడ్డుకు శంఖుస్థాపన చేసారు. వెంకటరమణపేట బహిరంగ సభలో ఇద్దరు మంత్రులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, జెడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గాదె శ్రీనివాసులనాయుడు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.