విజయనగరం

రూ.5.50 కోట్లతో సోలార్ విద్యుత్ ప్లాంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 8: మండలం ద్వారపూడి గ్రామంలో 5.50 కోట్ల రూపాయలతో ఒక మెగావాట్ సోలార్ ఉద్యుత్ ఉత్పాదన ప్లాంటును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సూచనల మేరకు ప్లాంటు ఏర్పాటుకోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించామని చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పాదన ప్లాంటు ఏర్పాటుపై మంగళవారం తన ఛాంబర్‌లో అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పాదన ప్లాంటును ఏర్పాటు ద్వారా కొంతవరకు విద్యుత్ సమస్యను పరిష్కరించవచ్చునని చెప్పారు. పట్టణంలో స్వచ్ఛ్భారత్ కింద సామాజిక మరుగుదొడ్లు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పట్టణాన్ని మలవిసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, అసిస్టెంట్ ఇంజనీర్ లక్ష్మోజీ పాల్గొన్నారు.