విజయనగరం

సజావుగా టెన్త్ పరీక్షల మూల్యాంకన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 10: పదవ తరగతి పరీక్షల మూల్యాంకన మహారాజా కోటలోని ప్రాంగణంలో సజావుగా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారావు, ప్రభుత్వ పరీక్షల కంట్రోలర్ సాయిబాబాలు దగ్గరుండి మూల్యాంకనను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహారాజ కోటలో రెండు మూల్యాంకన కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలను ఉపాధ్యాయులు దిద్దుతున్నారు. 14రోజులుపాటు జరిగే మూల్యాంకనంలో రోజుకు కనీసం ఆరువేల పేపర్లను ఉపాధ్యాయులు సరాసరిన మూల్యాంకనం చేయవలసి ఉంటుందని విద్యాశాఖ అధికారి కృష్ణారావు ఆంధ్రభూమికి తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మూల్యాంకనకు 5,30,000 పరీక్షా పేపర్లు వచ్చాయని ఆయన వెల్లడించారు. ముందుగానే ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశం కారణంగా రోజూ కనీసం 1500 మంది ఉపాధ్యాయులకు తగ్గకుండా మూల్యాంకనం నిర్ణీత గడువులో పూర్తయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
ఉదయం తొమ్మిదిగంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఒకో ఉపాధ్యాయుడు 40పరీక్షా పేపర్లను మూల్యాంకనం చేయవలసి ఉంటుందని ఆయన వివరించారు. ఆదివారం పదవ తరగతి పరీక్షల మూల్యాంకనను డిఇఓ కృష్ణారావు, రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ లింగేశ్వరరెడ్డి పర్యవేక్షించారు.