విజయనగరం

ఫసల్ బీమాకు డిసెంబర్ వరకు గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 18: రబీ సీజన్‌లో ఫసల్ బీమా ప్రీమియం చెల్లించేందుకు వచ్చే నెలాఖరు వరకు గడువు ఉంది. రబీ సీజన్‌లో వేసే పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో రైతులకు మేలు జరగనుంది. రబీలో వేసే పంటలకు కరవు, తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ బీమాద్వారా రైతులకు రక్షణ కలగనుంది. మొక్కజొన్న పంటకు గ్రామం యూనిట్‌గా లెక్కిస్తారు. ఇతర పంటలకు మండలం యూనిట్‌గా పరిగణిస్తారు. బ్యాంకుల నుంచి పంట రుణం తీసుకున్న రైతు తప్పనిసరిగా బీమాను చెల్లించాల్సి ఉంటుంది. రుణంలో పంటల ప్రీమియం మినహాయించి మిగిలిన మొత్తాన్ని రైతులకు అందజేస్తారు. బ్యాంకుల నుంచి రుణం పొందని రైతులు ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. అది నిర్బంధం కాదు. రైతుకు ఇష్టం ఉంటే ప్రీమియం చెల్లించవచ్చు. లేదా మానుకోవచ్చు. మొక్కజొన్న పంటకు డిసెంబర్ 15వతేదీలోగా ప్రీమియం చెల్లించాలి. ఇతర పంటలకు డిసెంబర్ 31వతేదీ వరకు గడువు ఉంది. వరికి ఎకరాకు రూ.420 చెల్లిస్తే రూ.28వేలు బీమా కల్పిస్తారు. మొక్కజొన్న పంటకు ఎకరాకు రూ.300 ప్రీమియం చెల్లిస్తే రూ.20వేల బీమా కల్పిస్తారు. మిరపకు ఎకరాకు రూ.1750 ప్రీమియం చెల్లిస్తే రూ.35 వేలు బీమా వర్తిస్తుంది. జొన్నకు రూ.150 ప్రీమియం చెల్లిస్తే రూ.10వేలు, వేరుశనగ పంటకు రూ.270 ప్రీమియం చెల్లిస్తే రూ.18వేలు బీమా కల్పిస్తారు.
బ్యాంకుల ద్వారా రుణాలు పొందని రైతులు తాము స్వంతంగా ప్రీమియం చెల్లించుకునే వెసులుబాటు ఉంది. దీనివల్ల ఖరీఫ్‌లో రైతులకు ప్రయోజనం కలిగింది. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రకాల బీమా అమలుచేసిన రైతులకు సక్రమంగా పరిహారం అందేది కాదు. దీనివల్ల రైతుల్లో నిరాశ ఎక్కువగా కనిపించేది. గతంలో బీమా ప్రీమియం చెల్లించేటప్పుడు ఆయా కంపెనీ ఏజంట్లు సకాలంలో ప్రీమియం చెల్లించక రైతులు ఎక్కువగా నష్టపోయేవారు. ఆపద సమయంలో రుణాలు ఆదుకోకపోవడంతో రుణాలు పొందని రైతులు ప్రీమియం చెల్లించడానికి ముందుకు రాలేదు. ఈసారి ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకంలో కొన్ని మెరుగైన ప్రయోజనాలు కల్పించనుండటంతో రైతుల్లో ఆసక్తి పెరిగింది. వాతావరణ పరిస్థితులు సహకరించకపోయి పంటలు వేయకపోయినా బీమా పొందే సౌకర్యం కల్పించారు. ప్రీమియం ధరలు కొంత మేరకు తగ్గించారు.