విజయనగరం

ఎయిడ్స్‌వ్యాధికి నివారణ ఒక్కటే మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), డిసెంబర్ 1: ఎయిడ్స్ వ్యాధి వ్యాపించకుండా అరికట్టడానికి అందరి సహకారం అవసరమని కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్‌నుండి వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ వివేక్‌యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారి వ్యాధిని నిరోధించడానికి సరైన మందు లేదన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహనతోనే ఈ వ్యాధిని సమాజం నుండి తరిమివేయగలమని హితవుపలికారు. ఎయిడ్స్ వ్యాధి నివారణలో జిల్లా 0.7 శాతంతో రాష్ట్రంలో 11వ స్ధానంలో ఉందన్నారు. ఎయిడ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం, ఎన్‌జిఓలు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో యువతకు ఈవ్యాధిపై అవగాహన కల్పించడానికి రెడ్‌రిబ్బన్ క్లబ్బులు ఏర్పాటు జరుగుతోందని ఆన్నారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వారిని దూరంగా ఉంచడం, వారిపట్ల వివక్ష పాటించడం మంచిదికాదన్నారు. ఎయిడ్స్ వ్యాధి రక్తం పరీక్ష చేయకుండా ఒకరినుండి ఇంకొకరికి ఎక్కించడం ద్వారా, ఎయిడ్స్ వ్యాధికి లోనయిన గర్భిణి ద్వారా పుట్టబోయే, సురక్షితంకాని సంబంధాల ద్వారా ఎక్కువగా వ్యాప్తిచెందుతుందన్నారు. అవగాహనతో ఈ వ్యాధిని అరికట్టే నిర్ణయం మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని మరువరాదని అన్నారు. అనంతరం జిల్లాత వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ కార్యదర్శి శ్రీహరి మాట్లాడుతూ హెచ్‌ఐవి బాధితులకు ఎటువంటి లీగల్ సమస్యలు ఉన్నా సంప్రదిస్తే లోక్ అదాలత్‌ద్వారా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పద్మజ, జిల్లా కేంద్ర ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ ఉషశ్రీ, ఆర్‌ఎంఓ డాక్టర్ సత్యశ్రీనివాస్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలకృష్ణ, ఆర్‌ఆర్‌సి కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్, డి ఐఒ కిషోర్‌కుమార్ పాల్గొన్నారు.

వైభవంగా తొలి మార్గశిర లక్ష్మివారం
* కనకమహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు
విజయనగరం(టౌన్), డిసెంబర్ 1: హిందూధర్మంలో పవిత్రమైన మాసాల్లో మార్గశిరమాసానికి ఎంతో విశిష్టత ఉంది. పవిత్రమైన ఈమాసంలో భక్తు లు శ్రీమహాలక్ష్మి అమవారికి ఎంతో భకక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. మార్గశిర మాసం ఆరంభంలోనే మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిరూపంగా భావి ంచి ఈప్రాంత వాసులు నమ్మి కొలిచే కొంగు బంగారం శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పాలు, ఇతర పూజా దవ్య్రాలతో అభిషేకాలు విశేషం గా నిర్వహిస్తారు. గురువారం ఉదయం నుండి పట్టణంలోని సిటీ బస్‌స్టాండ్ ఆవరణలో వెలసి భక్తులచేత పూజలు అందుకుంటున్న శ్రీకనకమహాలక్ష్మి అ మ్మవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయపూజారి వి.కెగా యత్రిశర్మ ఆధ్వర్యంలో పూజాదాకాలు నిర్వహించారు. పాలు, పసుపు, కుంకు మ, పళ్లరసాలతో భక్తులు అమ్మవారికి స్వయంగా అభిషేకాలు చేశారు.లయ ప్రాంగణంలో లక్ష్మీ గణపతిహోమంలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారికి శ్రీచక్ర పూజలు పూజారి సుబ్రమణ్యశర్మ నిర్వహించారు. ఈ ఏడాది మార్గశిర మాసం లో ఐదు విశిష్ట గురువారాలు వచ్చాయని ప్రతిరోజు అమ్మవారికి పంచామృతాభిషేక సేవలు, ఎరుపువస్త్రంతో అలంకారం, పసుపుకుంకుమలతో పూజలు నిర్వహిస్తామన్నారు. రెండవ గురువారం పసుపువస్త్రంతో, మూడవ వారం తులసితో గంధం రంగు వస్త్రంతో, నాల్గవ వారం విభూది, ఆకుపచ్చ వస్త్రంతో అలంకారం ఉంటుందన్నారు. ఐదవ వారం పట్టు వస్త్రంతో అమ్మవారికి అంకరణసేవ జరుగుతుందని చెప్పారు. తొలివారం పట్టణంలోని నలుమూలల నుండి భక్తులు పూజాదికాల్లో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అభిషేకజలం, పులిహోర ప్రసాదంగా వితరణచేశారు.