విజయనగరం

స్వచ్ఛ విజయనగరం దిశగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), డిసెంబర్ 2: స్వచ్ఛ విజయనగరం దిశగా మున్సిపల్ యంత్రాంగం అడుగులు ప్రారంభించింది. చారిత్రక పట్టణంగా రాష్ట్రంలోనే వినుతికెక్కిన విజయనగరం విద్యల్లోనే కాదు స్వచ్ఛతలోనూ రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలనే సంకల్పంతో అందుబాటులో ఉన్న నిధులకు చలనం కలిగించి మొత్తం యంత్రాంగం కదిలింది, పట్టణంలో నలభైవార్డులు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో స్లమ్ ఏరియాలో ఉన్నాయి. పట్టణ పరిధిలో ఆయకట్టులేని చెరువులు, వాటి చుట్టూ నివాసాలు వెలిశాయి. 300 ఏళ్ల చరిత్రగలిగిన విజయనగరం పట్టణ జనాభా సుమారు రెండు లక్షల పైచిలుకు ఉంటుంది. స్వచ్ఛ్భారత్‌కు ప్రధాని నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని తరచూ చెబుతున్నారు. అడపాదడపా వార్డుల్లో, కూడలి ప్రాంతాల్లో చీపుర్లు పట్టుకుని వీధులు ఊడ్చడానికి పరిమితమైన కార్యక్రమాన్ని ప్రజల్లోకి, బహిరంగ మలవిసర్జన చేస్తున్న ప్రాంతాలలోకి ప్రజానీకానికి అర్ధమయ్యే రీతిలో ఐసిడి పద్దుకింద అందుబాటులో ఉన్న నిధులకు చలనం కలిగించి ఇందుకు ఊతం ఇచ్చారు. పట్టణంలో సామూహిక మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి. వార్డుకు ఒకటి చొప్పున సామాజిక మరుగుదొడ్లు ఉన్నాయి. ఇందులో 38 వరకు బాగా పనిచేస్తుండగా మిగిలిన వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యంత్రాంగం ఒడిఎఫ్ కింద చర్యలు తీసుకుంటోంది. వ్యక్తిగత మరుగుదొడ్లను కూడా నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, సామూహిక మరుగుదొడ్లు వినియోగించేలా అవగాహన పెంచడానికి పట్టణంలోని 40 వార్డుల్లో వాల్ పెయింటింగ్‌లు, ఫ్లెక్సీలు, చెరువు గట్లపై బహిరంగ మలవిసర్జన నిషేధమని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహిళల ఆత్మగౌరవం నిలబెట్టడంతోపాటు పట్టణానికి ఆహ్లాదం, ప్రజలకు ఆరోగ్యం కలిగించే దిశగా మున్సిపల్ యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఇక్కడతో ఆగకుండా ప్రజలకు తెలియజేసేందుకు ఆటో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో మలవిసర్జన వారికి అపరాధ రుసుం ఐదువేల వరకు విధించడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకునేలా నిబంధనలు అమలు చేయడానికి పురపాలక సంఘం సమాయత్తమవుతోంది. మున్సిపల్ యంత్రాంగం చేపట్టిన ఈ చర్యలకు ప్రజల సహకారం ఎంతైనా అవసరం.