విజయనగరం

హోంగార్డుల సేవలు శ్లాఘనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 6: సమాజంలో హోంగార్డులు అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని జిల్లా ఎస్పీ ఎల్‌కెవి రంగారావు కొనియాడారు. మంగళవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 54వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ ఎల్‌కెవి రంగారావు మాట్లాడుతూ హోంగార్డులు నేడు అన్ని రంగాల్లో సేవలు అందిస్తున్నారన్నారు. దేశ రక్షణలోను, అంతర్గత రక్షణలో హోంగార్డుల సేవలు ఎనలేనివి అన్నారు. పోలీసులతో సమానంగా హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజాహితమే పోలీసుల మతమని ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయమని స్పష్టం చేశారు. పోలీసులు, హోంగార్డులు అవినీతికి తావులేకుండా చక్కని సేవలు అందించాలన్నారు. రానున్న కాలంలో ఎటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికైనా మొక్కవోని ధైర్యంతో పనిచేయాలన్నారు. దీనికి ముందర ఆయన హోంగార్డుల పెరేడ్‌ను తిలకించి వారినుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శాంతి కపోతాలను ఎస్పీ, పిటిసి ప్రిన్సిపాల్ ఎగురవేశారు. ఈ సందర్భంగా వివిధ క్రీడలు వాలీబాల్, వంద మీటర్ల పరుగుపందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్‌లలో గెలుపొందిన విజేతలకు ఎస్పీ, పిటిసి ప్రిన్సిపాల్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మయూర జంక్షన్‌వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ ఎవిరమణ, డిఎస్పీలు హనుమంతు, ఎవి రమణ, రాజేశ్వరరావు, త్రినాథ్, గురుమూర్తి, ఎఎస్‌చక్రవర్తి, ఆర్‌ఐలు శ్రీహరి, అప్పారావు, రామకృష్ణ, ఎఆర్‌ఎస్సైలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.