విజయనగరం

కుష్ఠు వ్యాధిపై సమగ్ర సర్వే చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 11: పట్టణంలో కుష్ఠువ్యాధి నిర్థారణ సర్వే సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కుష్ఠు నివారణ అధికారి డాక్టర్ డి.సుధాకర్ పట్నాయక్ కోరారు. పట్టణంలో పాత మున్సిపల్ కార్యాలయంలో ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా, అర్భన్ హెల్త్ సెంటర్ల వర్కర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులకు కుష్ఠువ్యాధి నిర్థారణ సర్వేపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ పట్నాయక్ మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రజలలో చైతన్యం తీసుకురావాలని అన్నారు. పట్టణంలో కుష్ఠువ్యాధి నిర్థారణపై ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని తెలిపారు. ఈనెల 12, 13 తేదీలలో అన్ని వార్డులలోను కుష్ఠువ్యాధి గురించి ప్రచారం చేయాలని, 13,14 తేదీలలో ఇంటింట సర్వే చేయాలని, 16,17 తేదీలలో అనుమానిత కేసులను నిర్థారించడంతోపాటు కుష్ఠువ్యాధి బారిన పడిన అంగవైకల్య వ్యాధిగ్రస్తులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ అర్భన్ ప్రాజెక్టు అధికారి ఎం.శ్రీదేవి, కుష్టు నివారణ పారామెడికల్ ఆఫీసర్ ఆంథోని, అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్ మాతా ప్రసాదరావుతదితరులు పాల్గొన్నారు.