విజయనగరం

రంగారెడ్డిలో ప్రమాదం.. బలిజపేటలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 9: పొట్ట చేతపట్టుకొని కూలీ పనుల కోసం హైదరాబాద్ వెళ్లిన కూలీల బతుకులు చిద్రమయ్యాయి. నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం పేక మేడలా కుప్పకూలిన సంఘటనలో జిల్లాకు చెందిన తల్లికూతురు మృత్యువాతపడ్డారు. వీరు బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన వారుగా గుర్తించారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి తాలూకాలోని నానక్‌రాంగుడాలో నిర్మాణంలో ఉన్న జి ప్లస్ 6 భవనం కుప్పకూలిన సంఘటనలో నాలుగు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా వారిలో ఇద్దరు జిల్లాలోని బలిజపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన తల్లి పైడమ్మ (48), కుమార్తె గౌరీ (16)గా గుర్తించారు.
ఈ సంఘటనతో మండలంలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా, రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళిని సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను ఆరా తీశారు. ఇదిలా ఉండగా మృతుని కుటుంబాలకు తెలంగాణా మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం విధితమే. కాగా, మృతదేహాలను ఇక్కడకు తీసుకురావడానికి ఆర్‌ఐ సన్యాసినాయుడు, బలిజపేట సిఎస్‌డిటిలను సంఘటనాస్థలానికి పంపినట్టు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. బాధితుల కుటుంబానికి ఆపద్భందు పథకం కింద రూ.50వేలు చెల్లించనున్నట్టు తెలిపారు.