విజయనగరం

‘అభివృద్ధి పనులను నెలాఖరులోగా పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, డిసెంబర్ 13: నగర పంచాయతీలో అభివృద్ధి పనులను నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రత్యేక అధికారి రాజకుమారి అన్నారు. మంగళవారం నగర పంచాయతీలో చేపడుతున్న అభివృద్ధి పనులను జెడ్పీ సిఇఓ పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు నెలల కిందట ప్రారంభమైన పనులు ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. శ్రీరామ్‌నగర్ కాలనీలో 50 లక్షల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. స్థానికులు పనులను అడ్డుకుంటున్నారని తెలిపారు. దీనిపై ప్రత్యేక అధికారి మాట్లాడుతూ అభివృద్ధి పనులను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని అన్నారు. పోలీసు, రెవెన్యూ శాఖ సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పనులు అడ్డుకున్నవారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నగదు కొరత కూడా అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తుందని ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకెళ్లారు. నగర పంచాయతీ కమిషనర్ అచ్చింనాయుడు మాట్లాడుతూ రూ.6 కోట్లతో 82 పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇప్పటికే రూ.1.45 కోట్లతో 36 పనులు పూర్తిచేసామని చెప్పారు. మిగిలిన 56 పనుల్లో 22 పనులు నిర్మాణదశలో ఉండగా, మరో 22 పనులు ప్రారంభించామని అన్నారు. కార్యక్రమంలో పిడబ్ల్యు డిడిఇ తారాప్రసన్న, అప్పారావు పాల్గొన్నారు.

నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ : బిజెపి
నెల్లిమర్ల, డిసెంబర్ 13: నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో అభ్యుర్థులు నిలబడతామని దళిత మోర్చ రాష్ట్ర కార్యదర్శి ఆదాడ మోహన్, బిజెపి జిల్లా కార్యదర్శి పిన్నింటి వాసు తెలిపారు. నెల్లిమర్ల ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం వారు మాట్లాడుతూ నగర పంచాయితీ ఎన్నికల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గెలిపించడానికి కృషి చేస్తామన్నారు. ప్రతిభ, సేవాభావం కలిగిన యువకులకు బిజెపి తరపున కౌన్సిలర్లుగా ఫోటో చేస్తే అవకాశం కల్పిస్తామన్నారు. నగర పంచాయతీ పరిధిలోని ప్రజలకు పింఛన్లు, ఎన్టీఆర్ గృహ పథకం అర్హులకు అందేటట్లు చూస్తామన్నారు. త్వరలో నిర్వహించనున్న నగర పంచాయతీ ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వంలో నిస్వార్థంగా పనిచేసే వారికి అవకాశం కల్పిస్తామని అన్నారు. నల్లధనం వెలికి తీయడానికి ప్రధాని మోదీ పెద్ద నోట్లు రద్దు చేశారని చెప్పారు. బ్యాంకర్లు బడాబాబులకు అనుకూలంగా పనిచేసి పెద్దనోట్లు మార్పిడి చేస్తున్నారన్నారు. తప్పుచేస్తున్న బ్యాంకర్లపై దేశ ద్రోహ కేసు నమోదు చేయాలని కోరారు.